తనకు జరిగిన కారు ప్రమాదంపై శేఖర్ మాస్టర్ స్పందించారు. అయ్యప్ప దయవల్ల ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం శేఖర్ మాస్టర్ అయ్యప్ప దీక్షలో ఉన్నారు.
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ న్యూస్ తో శేఖర్ మాస్టర్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. శేఖర్ మాస్టర్ తో సహా కారులో ప్రయాణిస్తున్న నలుగురు క్షేమంగా బయటపడ్డారు. శేఖర్ మాస్టర్ ప్రమాదం నుంచి తప్పించుకోవడం తో ఆయన అభిమానులు, సినీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.
24
ప్రమాదం ఎలా జరిగింది అంటే
శేఖర్ మాస్టర్ బుధవారం రాత్రి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కాకా సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ నాలుగు రోడ్ల కూడలి వద్దకు శేఖర్ మాస్టర్ కారు రాగానే వెనుక నుంచి వచ్చిన ఒక ట్రక్కు శేఖర్ మాస్టర్ కారుని ఢీ కొట్టింది. దీనితో శేఖర్ మాస్టర్ కారు వెనుక భాగంగా బాగా డ్యామేజ్ అయింది. అయితే ఎదురుగా ఎలాంటి వాహనాలు లేకపోవడంతో శేఖర్ మాస్టర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
34
అయ్యప్ప దయవల్ల అందరూ క్షేమం
కారులో ఉన్న ఇతరులు కూడా ప్రమాదం నుంచి సేఫ్ అయ్యారు. ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు ట్రక్కు డ్రైవర్ పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ ప్రమాదంపై శేఖర్ మాస్టర్ తాజాగా స్పందించారు. అభిమానుల కోసం వీడియో వదిలారు. 'స్వామియే శరణం అయ్యప్ప.. ఈ రోజు మార్నింగ్ నుంచి న్యూస్ వస్తోంది.. అవును మేము ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. నిన్న బుధవారం రాత్రి షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వెళుతుండగా తెల్లవారు జామున యాక్సిడెంట్ జరిగింది. కారు వెనుక నుజ్జు నుజ్జు అయింది. కారులో నలుగురం ఉన్నాయి. ఎవ్వరికీ ఏమీ కాలేదు.
ఆ అయ్యప్ప దయవల్ల ఎవ్వరికీ ఏమీ జరగలేదు. అందరం బాగానే ఉన్నాం. చాలా మంది శ్రేయోభిలాషులు, స్నేహితులు, అభిమానులు ఫోన్లు మెసేజ్ లు చేస్తున్నారు. నేను క్షేమంగా ఉండాలి అని కోరుకున్న వారందరికీ థ్యాంక్స్. అయ్యప్ప దయవల్ల అంతా క్షేమంగా ఉన్నాం. ఈ రోజు రాత్రి మళ్ళీ షూటింగ్ కి వెళుతున్నా' అని శేఖర్ మాస్టర్ తెలిపారు. ప్రస్తుతం శేఖర్ మాస్టర్ అయ్యప్ప దీక్షలో ఉన్నారు.