మిర్రర్ సెల్ఫీలతో ఆకట్టుకుంటున్న బన్నీ వైఫ్.. స్టైలిష్ స్టార్ భార్య అంటే ఆ మాత్రం ఉండాల్సిందే..

First Published | Mar 18, 2023, 1:32 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి బ్యూటీఫుల్ లుక్స్ లో ఆకట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తున్న అల్లువారి కోడలు తాజాగా మిర్రర్ సెల్ఫీలతో కట్టిపడేసింది.
 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) భార్యగా అల్లు స్నేహారెడ్డి (Allu Sneha Reddy)  అందరికీ సుపరిచితమే. ఎప్పుడూ సోషల్ మీడియాలో ఉంటూ అల్లు అర్జున్, తమ పిల్లలకు సంబంధించిన పోస్టులతో ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తుంటారు.
 

నెట్టింట అల్లు స్నేహారెడ్డికి సైతం గట్టి ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. ఫ్యామిలీ అప్డేట్స్ ను అందిస్తూ అల్లు అర్జున్ అభిమానులను సంతోషపెడుతుంటుంది. రీసెంట్ గా ఫ్యామిలీతో వేకేషన్ కు వెళ్లిన ఫొటోలు, వీడియోలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. 
 


ఇలా బన్నీ ఫ్యాన్స్ తో పాటు.. తన ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటూ ఉంటున్నారు. మరోవైపు ట్రెండీ అవుట్ ఫిట్స్ లోనూ, ట్రెడిషనల్ వేర్స్ లోనూ ఫొటోషూట్లు సైతం చేస్తూ నెటిజన్లను కట్టిపడేస్తుంటారు. ఇప్పటికే పలు సందర్భాల్లో బ్యూటీఫుల్ ఫొటోలను ఫ్యాన్స్ తో పంచుకున్న విషయం తెలిసిందే. 
 

ఇక తాజాగా మిర్రర్ సెల్ఫీలతో కూడిన ఓ రీల్ ను షేర్ చేసింది. ఈ రీల్ లో అల్లు స్నేహారెడ్డి ట్రెండీ వేర్స్ లో, స్టైలిష్ సూట్ లో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకున్నారు. అదే క్రమంలో మిర్రర్ సెల్ఫీలతో ఫ్యాన్స్ నూ కట్టిపడేసింది. 
 

లేటెస్ట్ పోస్ట్ షేర్ చేస్తూ..  ‘మిర్రర్ సెల్ఫీలను ఎవరు ఇష్టపడరు?’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. స్టైలిష్ లుక్ లో మెరియడంతో బన్నీ ఫ్యాన్స్ ను ఖుషీ అవుతున్నారు. ఆమె ఫ్యాషన్ సెన్స్ ను, బ్యూటీఫుల్ లుక్స్ ను పొగుడుతూ ఆకాశానికి ఎత్తారు.
 

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తుంటారు. ఫ్యామిలీకి సంబంధించిన అప్డేట్స్ తో పాటు.. కొన్ని ఆరోగ్య సూత్రాలను అభిమానులకు చెబుతుంటారు. రీసెంట్ యోగాకు సంబంధించిన రీల్ షేర్ చేసుకొని ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్  ‘పుష్ప2’లో నటిస్తున్నారు.

Latest Videos

click me!