ఇక జుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది తాప్సీపన్ను. తెలుగులో ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. దాంతో 2015 లో బాలీవుడ్ కు షిప్ట్ అయ్యింది. అయితే టాలీవుడ్ లో గ్లామర్ పాత్రలకు ఇంపార్టెన్స్ ఇచ్చిన తాప్సీ.. బాలీవుడ్ మాత్రం కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు, విమెన్ సెంట్రిక్ సినిమాలత పాపులర్ అయ్యింది. నిర్మాతగామారి కొన్ని సినిమాలు నిర్మించిన తాప్సీ.. బాలీవుడ్ లో కాంట్రవర్సీ కింగ్ లా మారింది. అంతే కాదు ఈమధ్య బయోపిక్ సినిమాల వెంట పడింది బ్యూటీ. మళ్ళీ టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది.