నాన్న వద్దని చెప్పిన సినిమాలన్నీ ఫ్లాప్.. చెప్పుతో కొడతా అని ఎందుకు అన్నారంటే, అల్లు శిరీష్ కామెంట్స్

First Published Nov 10, 2022, 9:04 PM IST

ఎట్టకేలకు అల్లు శిరీష్ కి ఒక మంచి హిట్టు పండింది. అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ఊర్వశివో రాక్షసివో చిత్రం యువతని ఆకట్టుకుంటూ రొమాంటిక్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.

ఎట్టకేలకు అల్లు శిరీష్ కి ఒక మంచి హిట్టు పండింది. అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ఊర్వశివో రాక్షసివో చిత్రం యువతని ఆకట్టుకుంటూ రొమాంటిక్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. నవంబర్ 4న విడుదలైన ఈ చిత్రానికి తొలి షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. 

ఇటీవల జరిగిన సక్సెస్ మీట్ ఈవెంట్ కి బన్నీ ముఖ్య అతిథిగా హాజరు కావడం కూడా చూశాం. సహజీవనం కాన్సెప్ట్ తో న్యూ ఏజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ రొమాన్స్ లో రెచ్చిపోయారు. సునీల్, వెన్నెల కిషోర్ కామెడీ ఈ చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చింది. 

అల్లు శిరీష్ ఈ చిత్ర ప్రమోషన్స్ తో బిజీగా గడుపుతున్నాడు. ఇటీవల శిరీష్ అలీతో సరదాగా కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యాడు. ఈ షోలో అలీ అడిగిన అన్ని ప్రశ్నలకు శిరీష్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. ఎబిసిడి తర్వాత అల్లు శిరీష్ నటించిన చిత్రం ఇదే. ఇంత గ్యాప్ ఎందుకొచ్చింది అని అలీ ప్రశ్నించారు. దీనికి శిరీష్ బదులిస్తూ ఏదో ఒకటి చేసేసి దానికి సరైన స్పందన రాకుంటే నిరాశ పడడం ఎందుకు అని వెయిట్ చేశా. మంచి కథ సెలెక్ట్ చేసుకోవడంలో ఆలస్యం జరిగింది అని శిరీష్ తెలిపాడు. 

తన చిత్రాల కథల ఎంపిక ఎవరి డెసిషన్ అని అడగ్గా.. ఇకపై నాన్న ఒకే చెప్పిన కథలనే చేస్తా. గౌరవం, ఒక్క క్షణం, ఎబిసిడి చిత్రాలన్నీ నా నిర్ణయాలు. ఆ మూవీస్ చేయవద్దని నాన్న ముందే చెప్పారు. కానీ చేశా. అవన్నీ పరాజయం చెందాయి. ఊర్వశివో రాక్షసివో కథని నాన్న మొదట విన్నారు. నేనైతే బావుంటుంది అని ఆయనకి అనిపించింది. ఇకపై ఆయన సెలెక్ట్ చేసిన చిత్రాలే చేస్తా అని శిరీష్ తెలిపాడు. 

Mega Family

అల్లు అరవింద్ ఒక సందర్భంలో శిరీష్ ని చెప్పుతో కొడతా అని తిట్టారట. ఆ సంగతి ఏంటో శిరీష్ వివరించాడు. అల్లు అర్జున్, రామ్ చరణ్ లకి 21 ఏళ్ళు నిండిన తర్వాత కారు గిఫ్ట్ గా ఇచ్చారు. నాకు కూడా 21 ఇయర్స్ వచ్చాక నాన్నని కారు కొనిమ్మని అడిగాను. పలానా ప్రొడ్యూసర్ కొడుకుకి కారు ఉంది. నాక్కూడా తీసివ్వు అని అడిగా. వెంటనే చెప్పుతో కొడతా అని తిట్టారు. 

నేను ఎంత ఇవ్వాలో అంతే డబ్బు ఇస్తా. మిగిలినది నువ్వు సంపాదించి కొనుక్కో అని అన్నారు. అప్పట్లో నాకు డబ్బు విలువ తెలియదు. అందుకే ఆయన అలా తిట్టారు. డబ్బు విషయంలో, సినిమాల విషయంలో ఆయన జడ్జిమెంట్ ఎప్పుడూ సరైన విధంగానే ఉంటుంది. 

click me!