ప్రభాస్ ఒక హీరోయిన్ కు చీరను గిఫ్ట్ గా ఇవ్వడం ఏంటి..? ఆ చీరను ఆ హీరోయిన్ మూడేళ్లు దాచుకోవడం ఏంటి? దాచుకున్న ఆ చీరను ఆమె ఎప్పుడు కట్టుకుందో తెలుసా? ఇంతకీ ఎవరా హీరోయిన్? ఏంటీ చీర కథ.
పాన్ ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్. ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. రీసెంట్ గా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ తరువాత అవి మరింతగా పెరిగిపోయాయి. కామెడీ సినిమాల దర్శకుడిగా పేరుగాంచిన మారుతీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ సరసన ఈసినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రభాస్ తన కెరీర్‌లో తొలిసారి హారర్ అండ్ కామెడీ జానర్‌లో నటిస్తుండటంతో.. ఈ సినిమాపై అభిమానులు, ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
24
ఘనంగా రాజాసాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్...
ప్రపంచవ్యాప్తంగా రాజాసాబ్ సినిమా 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఇటీవల ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌లో చాలా గ్రాండ్‌గా జరిగిన ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్‌తో పాటు ప్రభాస్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. స్టేజ్‌పై జరిగిన ప్రసంగాలు, వీడియోలు, వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
34
హీరోయిన్ కు చీరను గిఫ్ట్ గా ఇచ్చిన ప్రభాస్..
ఈ ఈవెంట్‌లో రాజాసాబ్ హీరోయిన్లలో ఒకరైన రిద్ధి కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. స్టేజ్‌పై రిద్ధి కుమార్ మాట్లాడుతూ, “ప్రభాస్ గారితో ‘ది రాజాసాబ్’ సినిమా చేయటం చాలా సంతోషంగా ఉంది. మూడు సంవత్సరాల క్రితం ఆయన నాకు ఒక చీరను కానుకగా ఇచ్చారు. అది నాకు చాలా స్పెషల్. అందుకే ఈరోజు ఈ ఈవెంట్‌కు ప్రభాస్ ఇచ్చిన ఆ చీరలోనే వచ్చాను” అని చెప్పారు. ప్రభాస్ ఏంటి.. హీరోయన్ కు చీరను బహుమతిగా ఇవ్వడం ఏంటి.. ఆ చీరను మూడేళ్లు ఆమె దాచుకోవడం ఏంటి? ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆ చీరలోనే రావడం ఏంటి..? అని అభిమానులు షాక్ అవుతున్నారు.
రిద్ధి కుమార్ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభాస్ అభిమానులు ఒక్కసారిగా ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. ప్రభాస్.. ప్రభాస్.. అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియోను రెబల్ అభిమానులు మరింతగా వైరల్ చేస్తున్నారు. ఈక్రమంలోనే ఆయన పెళ్లి గురించి కూడా అభిమానుల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తమ అభిమాన హీరోకు 50 ఏళ్లు వస్తున్నా.. ఇంకా పెళ్లి చేసుకోకపోవడంపై.. అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ పెళ్లి గురించి రకరకాల వార్తలు వైరల్ అవతూ వస్తున్నాయి. అసలు విషయం మాతరం ఇంతక వరకూ అఫీషియల్ గా ఎవరు వెల్లడించలేదు.