Chiranjeevi: ఫస్ట్ టైం చూడగానే చిరంజీవి ఫ్యూచర్ చెప్పేసిన అల్లు రామలింగయ్య.. అందుకే ఏరికోరి అల్లుడిగా..

Published : Jul 15, 2022, 08:59 PM IST

సురేఖతో పెళ్లి జరిగే సమయానికి చిరంజీవి టాలీవుడ్ లో అప్ కమింగ్ నటుడు మాత్రమే. అప్పటికి ఇంకా చిరంజీవికి సరైన గుర్తింపు దక్కలేదు. పునాది రాళ్లు , మనవూరి పాండవులు, ప్రాణం ఖరీదు లాంటి చిత్రాలతో కెరీర్ ఆరంభంలోనే ఉంది.

PREV
16
Chiranjeevi: ఫస్ట్ టైం చూడగానే చిరంజీవి ఫ్యూచర్ చెప్పేసిన అల్లు రామలింగయ్య.. అందుకే ఏరికోరి అల్లుడిగా..

సురేఖతో పెళ్లి జరిగే సమయానికి చిరంజీవి టాలీవుడ్ లో అప్ కమింగ్ నటుడు మాత్రమే. అప్పటికి ఇంకా చిరంజీవికి సరైన గుర్తింపు దక్కలేదు. పునాది రాళ్లు , మనవూరి పాండవులు, ప్రాణం ఖరీదు లాంటి చిత్రాలతో కెరీర్ ఆరంభంలోనే ఉంది. కానీ అల్లు రామలింగయ్య.. చిరంజీవిని ఏరి కోరి అల్లుడిగా ఎంచుకోవడం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. 

26

మనవూరి పాండవులు చిత్రంలో చిరంజీవి తన పాత్రలో ఎప్పుడూ సైకిల్ తొక్కుతూ కనిపిస్తారు. ఆ చిత్రంలో అల్లు రామలింగయ్య కీలక పాత్రలో నటించారు. అప్పుడే రామలింగయ్య చిరంజీవిని మొదటి సారి చూశారట. ఈ సైకిల్ కుర్రాడెవరో కానీ మంచి ఫ్యూచర్ ఉంది అని నిర్మాత జయకృష్ణతో అన్నారట. చిరంజీవి కళ్ళలో నటుడిగా స్పార్క్ ని రామలింగయ్య గమనించారట. అందుకే గొప్ప నటుడు అవుతాడని ముందుగానే పసిగట్టారు. 

36

తన కొడుకు అల్లు అరవింద్ తో చిరంజీవి గురించి ఆరా తీయమని చెప్పారు. పున్నమి నాగు ప్రీవ్యూ ప్రదర్శిస్తుండగా అక్కడ అల్లు అరవింద్ తొలిసారి చిరంజీవిని కలిశారు. అల్లు అరవింద్ తో చిరు చాలా వినయంగా మాట్లాడారట. అల్లు అరవింద్ కూడా నాన్న గారు మిమ్మల్ని ఒకసారి కలవాలంటున్నారు.. వస్తారా అని అడిగారు. అలా మొదటిసారి చిరంజీవి అల్లు రామలింగయ్యని కలిశారు. 

46

ఇక రామలింగయ్య సురేఖని చిరంజీవికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని అరవింద్ చిరంజీవి వద్ద ప్రస్తావించగా.. చిరు మొదట ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ఓకె చెప్పారు. సురేఖకి కూడా చిరంజీవిని మొదటి సారి చూసినప్పుడు ముఖం గుండ్రంగా ఉంది.. కళ్ళు బావున్నాయి అనే ఇంప్రెషన్ కలిగిందట. 

56

అలా చిరంజీవి, సురేఖ ల పెళ్లి ముహూర్తం ఫిబ్రవరి 20, 1980లో ఫిక్స్ అయింది. చిన్న చిన్న పాత్రలు వేసుకునే చిరంజీవికి రామలింగయ్య గారు ఏంటి తన కుమార్తెని ఇస్తున్నారు అని కొందరు కామెంట్స్ కూడా చేశారట.  చిరు పెళ్లి సినిమాటిక్ లెవల్ లో జరిగింది. చిరు పెళ్లి రోజే  చిరంజీవికి కీలకమైన షూటింగ్ ఉంది. నూతన్ ప్రసాద్ తో కలసి చిరంజీవి నటించాలి. ఇప్పుడు మిస్ అయితే నెలవరకు నూతన్ ప్రసాద్ డేట్స్ లేవు. 

66

ఈ పరిస్థితిని చిరు రామలింగయ్యకి వివరించారు. దీనితో రామలింగయ్య.. షూటింగ్ లొకేషన్ కి దగ్గర్లోనే పెళ్లి ఏర్పాట్లు చేశారు. దీనితో చిరంజీవి షూటింగ్ లో ధరించిన చిరిగిన చొక్కా తోనే పెళ్లి మండపంలోకి ఎంటర్ అయ్యారట. పెళ్లి జరిగిన ఐదేళ్లలోనే చిరంజీవి టాలీవుడ్ లో తిరుగులేని నటుడిగా మారిపోయారు. 

click me!

Recommended Stories