70th Filmfare Awards: ఫిల్మ్ ఫేర్‌లోనూ పుష్పగాడి రూల్‌.. బెస్ట్ యాక్టర్స్ ఎవరంటే? టోటల్‌ లిస్ట్

Published : Feb 22, 2026, 11:08 AM IST

70th Filmfare Awards:  ఫిల్మ్ ఫేర్‌ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. ఇందులో అల్లు అర్జున్‌ నటించిన `పుష్ప 2` మూవీ సత్తా చాటింది. అలాగే `గుంటూరు కారం`, `కమిటీ కుర్రోళ్లు` మూవీస్‌ అవార్డులను అందుకున్నాయి. 

PREV
13
ఫిల్మ్ ఫేర్‌ అవార్డుల్లో అల్లు అర్జున్‌ `పుష్ప 2` రూలింగ్‌

70వ ఫిల్మ్ ఫేర్‌ అవార్డుల వేడుక శనివారం రాత్రి జరిగింది. కేరళా టూరిజంతో కలిసి నిర్వహించిన ఈ వేడుక కొచ్చిలో జరిగింది. చాలా గ్రాండ్‌గా ఈ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ ఫిల్మ్ ఫేర్‌ అవార్డుల్లో తెలుగు విభాగంలో `పుష్ప2` సినిమా సత్తా చాటింది. అత్యధికంగా అవార్డులు దక్కించుకుంది. దీనికి ఏకంగా ఐదు అవార్డులు రావడం విశేషం. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌, నటిగా నివేదా థామస్‌ నిలిచారు. మరి తెలుగు సినిమా కేటగిరిలో అవార్డులు అందుకున్న మూవీస్‌ ఏంటో టోటల్‌ లిస్ట్ చూద్దాం.

23
70వ ఫిల్మ్ ఫేర్‌ అవార్డు లిస్ట్ (తెలుగు)

బెస్ట్ ఫిల్మ్- పుష్ప 2

బెస్ట్ డైరెక్టర్‌ - సుకుమార్‌ (పుష్ప 2)

బెస్ట్ ఫిల్మ్ (క్రిటిక్స్) - లక్కీ భాస్కర్‌ (వెంకీ అట్లూరి)

బెస్ట్ యాక్టర్‌ - అల్లు అర్జున్‌ (పుష్ప 2)

బెస్ట్ యాక్టర్‌(క్రిటిక్స్) - తేజ సజ్జా (హనుమాన్‌)

బెస్ట్ యాక్ట్రెస్‌ -  నివేదా థామస్‌ (35 చిన్న కథ కాదు)

బెస్ట్ యాక్ట్రెస్‌(క్రిటిక్స్) - కాజల్‌ అగర్వాల్‌ (సత్యభామ)

బెస్ట్ సపోర్టింగ్‌ యాక్టర్‌ - అమితాబ్‌ బచ్చన్‌ ( కల్కి 2898 ఏడీ)

బెస్ట్ సపోర్టింగ్‌ యాక్ట్రెస్‌ - అంజలి ( గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి)

బెస్ట్ మ్యూజిక్‌ - దేవిశ్రీ ప్రసాద్‌ (పుష్ప 2)

బెస్ట్ లిరిక్‌ - రామజోగయ్య శాస్త్రి (చుట్టమల్లే -దేవర)

33
గుంటూరు కారం, కమిటీ కుర్రోళ్లకి రెండు అవార్డులు

బెస్ట్ ప్లేబ్యాక్‌ సింగర్‌(మేల్‌) - శ్రీ కృష్ణ (కుర్చీ మడతపెట్టి-గుంటూరు కారం)

బెస్ట్ ప్లేబ్యాక్‌ సింగర్‌(ఫిమేల్‌) - శిల్పా రావు (చుట్టమల్లె-దేవర)

బెస్ట్ డెబ్యూ డైరెక్టర్‌ -  యదు వంశీ (కమిటీ కుర్రోళ్లు)

బెస్ట్ డెబ్యూట్‌ హీరో - సందీప్‌ సరోజ్‌ (కమిటీ కుర్రోళ్లు)

బెస్ట్ డెబ్యూట్‌ ఫిమేల్‌ - నయన్‌ సారిక (గం గం గణేష)

బెస్ట్ ప్రొడక్షన్‌ డిజైన్‌ - నితిన్‌ జిహాని చౌదరీ(కల్కి 2898 ఏడీ), రామకృష్ణ అండ్‌ మోనికా(పుష్ప 2)

బెస్ట్ కొరియోగ్రఫీ - శేఖర్‌ మాస్టర్‌ (కుర్చి మడతపెట్టి-గుంటూరు కారం)

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories