ICON STAR ALLU ARJUN: పుష్పరాజ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్బంగా కొత్త సినిమా అప్‌డేట్ వచ్చేసింది. పుష్ప-2 ద రూల్‌లో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసిన బన్నీ.. అతపే తదుపరి నటించబోతున్న సినిమాకు సంబంధించి వీడియోను ఆ చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేసింది. రీసెంట్‌గా అర్జున్ స్నేహితుడు బన్నీ వాసు కూడా ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. ముందు చెప్పినట్లుగానే ఆ సర్‌ప్రైజ్ మామూలుగా లేదు. ముఖ్యంగా బన్నీ ఫ్యాన్స్ గర్వపడేలా కాదు.. ఇండియన్ సినిమా గర్వపడేలా సినిమా ఉండబోతున్నట్లు విడుదల చేసిన వీడియో ద్వారా తెలుస్తోంది. ఐకాన్ స్టార్ తర్వాత చిత్రం విశేషాలు తెలుసుకుందామా!!!
Allu Arjun Next Movie with Atlee: A Hollywood-Style Sci-Fi Blockbuster
మేకింగ్ చూస్తుంటే పిచ్చెక్కిస్తోంది..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా సినిమాకు తన స్థాయిని పెంచుకుంటూ వస్తున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా బ్లాక్‌బస్టర్ దర్శకుడు అట్లీతో చేయబోయే చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వీడియో రూపంలో చూపించారు. అంతేకాదు ఆ చిత్రాన్ని ఎవరు నిర్మిస్తున్నారు అన్న వివరాలు కూడా తెలిపారు. ఆ మేకింగ్ చూస్తుంటే మాత్రం ఈ సారి ఇండియన్ మార్కెట్ కాదు. ఇంటర్నేషన్‌పై ఐకాన్ స్టార్ కన్నేసినట్లుగా స్పస్టంగా తెలుస్తోంది.
25
Allu Arjun Next Movie with Atlee: A Hollywood-Style Sci-Fi Blockbuster
ప్రాజెక్టుకు AA22xA6 వర్కింగ్ టైటిల్
అర్జున్ తర్వాతి సినిమాను సన్ పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించేందుకు సిద్దమవుతోంది. ఈ ప్రాజెక్టుకు AA22xA6 వర్కింగ్ టైటిల్ పెట్టారు. అంటే.. అల్లు అర్జున్ 22వ చిత్రం, అట్లీ దర్శకుడిగా 6వ చిత్రం తీస్తుండటంతో ఈ పేరు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమానకు సంబంధించి కథ ఏవిధంగా ఉంటుంది అన్న వివరాలు అయితే బయటకు రాలేదు. కానీ అట్లీ ఇచ్చిన స్టోరీకి మాత్రం భారీగా వీఎఫ్‌ఎక్స్ అవసరం ఉందని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.
35
కథ మామూలుగా ఉండదంట..
ఈ ప్రాజెక్టకు సంబంధించి వీఎఫ్‌ఎక్స్ టీంని ఈరోజు నిర్మాణ సంస్థ పరిచయం చేసింది. ఈ సందర్బంగా అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ ఇద్దరూ ఇండియా నుంచి అమెరికాకు ఫ్లైట్‌లో వచ్చారు. అమెరికాలో హాల్‌వుడ్ చిత్రాలకు వీఎఫ్‌ఎక్స్ చేసే స్టూడియోలను వారిద్దరూ పరిశీలించారు. పలు రకాల ఫేస్ మాస్క్‌లను ఇద్దరూ పరిశీలించారు. ఇక అట్లీ తీయబోతున్న కథ ఏవిధంగా ఉందని అక్కడి వారిని అడిగితే.. అట్లీ స్క్రిప్ట్ చదివిన తర్వాత చాలా ఎనర్జిటిగ్ ఉందని వాస్తవంగా చాలా సవాలుతో కూడిన ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలుస్తుందని హాలీవుడ్ టెక్నీషియన్లు చెబుతున్నారు.
45
Allu arjun Atlee movie announcement sun pictures produce A22XA6
హాలీవుడ్‌కి తగ్గేదేలా అంటూ..
సినిమా నిర్మాణ సంస్థ విడుదల చేసిన వీడియో ప్రకారం.. బన్నీ తాజా సినిమాకు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. అల్లు-అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రానికి లాస్‌ఏంజెల్స్‌కు చెందిన వీఎఫ్‌ఎక్స్ సంస్థ పనిచేస్తోందని వీడియోలో చూపించారు. ఈ సినిమా సైంటిఫిక్ తరహాలో, ఏలియన్స్, గ్రాహాంతరవాసులు తదితర ఆకారాలతో వీఎఫ్‌ఎక్స్ బొమ్మలను దర్శకుడు, హీరో పరిశీలిస్తుండటం గమనిస్తే.. రెగ్యులర్‌గా ఉండే కథ కాదని స్పష్టంగా తెలుస్తోంది.
55
Atlee Allu Arjun Movie
అల్లు అర్జున్‌కి త్రీడీ పరీక్షలు..
తాజాగా విడుదల చేసిన వీడియోలో అల్లు అర్జున్ ఫేస్‌కి తగ్గట్లుగా 360 డిగ్రీలలో త్రీడీ 3D స్కానింగ్ చేయించుకుంటున్నారు. దీని ప్రకారం ఆయన గెటప్ కూడా మారుతుందని తెలుస్తోంది. ఫేస్‌కి ఏదైనా మాస్క్ ఉంటుందా లేదా ఐ సినిమాలో హీరోలా ప్రయోగం చేయబోతున్నారా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి ప్రేక్షకులకు మాత్రం సినిమాటిక్ అనుభూతిని ఇచ్చేందుకు అట్లీ-అల్లు టీం సిద్దమవుతోంది. త్వరలో సినిమాకు పనిచేసే ఇతర నటీనటులు, తారల వివరాలు వెల్లడించనున్నారు. సాయి అభ్యాంకర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తమిళ్‌లో మెర్సల్, , తేరి, బిగిల్ సినిమాలతో మంచి విజయాలను అందుకుని బాలీవుడ్‌కి నటుడు షారుఖ్ ఖాన్‌తో జవాన్ చిత్రంతో నేషనల్ వైడ్‌గా అట్లీ గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు కోలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ ఎత్తున చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తుండటం విశేషం. వీరి ఎనర్జీకి బన్నీ లాంటి వైల్డ్ ఫైర్ తోడైతే హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా చిత్రం నిలవనుంది.