పవన్ కళ్యాణ్ తో వైరం, పుష్ప 2కి దెబ్బ తప్పదు... సంచలనంగా డైరెక్టర్ కామెంట్స్!

First Published Jun 14, 2024, 1:47 PM IST

రాజకీయాల్లో అల్లు అర్జున్ ఒక బచ్చా. అల్లు అరవింద్ కి చిరంజీవి బంగారు బాతులా దొరకడంతో స్టార్ ప్రొడ్యూసర్ అయ్యాడు. ఎన్నికల వివాదంతో పుష్ప 2కి దెబ్బ తప్పదు... అంటూ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. 
 

మెగా వర్సెస్ అల్లు... టాలీవుడ్ లో హాట్ టాపిక్. మొన్నటి వరకు తెరమరుగున ఉన్న విబేధాలు వెలుగులోకి వచ్చాయి. కొన్నాళ్లుగా అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ కి దూరంగా ఉంటున్నాడు అనేది నిజం. మెగా ఫ్యామిలీ మీద కసితో అతడు కెరీర్లో ఎదగాలని నిర్ణయించుకున్నాడు. 

దీనికి కొన్ని సంఘటనలు కారణం అయ్యాయి. సరైనోడు మూవీ విజయోత్సవ వేడుకలో 'చెప్పను బ్రదర్' అని అల్లు అర్జున్ చేసిన కామెంట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని హర్ట్ చేసింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్  వేడుకలో చేస్తున్న రచ్చకు విసిగిపోయిన అల్లు అర్జున్ తన అసహనాన్ని బయటపెట్టాడు. పవన్ కళ్యాణ్ పేరు చెప్పనని నేరుగా కౌంటర్ ఇచ్చాడు. అల్లు అర్జున్ తదుపరి చిత్రం డీజే పై పవన్ ఫ్యాన్స్ నెగిటివ్ ప్రచారం చేశాడు. 

తాజాగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామం మెగా-అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ మరింత పెంచేసిందనే వాదన మొదలైంది. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్ నేరుగా తన మద్దతు ప్రకటించారు. ఇది పవన్ కళ్యాణ్, నాగబాబు, చిరంజీవి, చరణ్ తో పాటు మెగా ఫ్యామిలీలో తీవ్ర అసహనానికి దారి తీసింది. సాయి ధరమ్ తేజ్ ఇటీవల ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ అకౌంట్స్ లో అల్లు అర్జున్ ని అన్ ఫాలో చేశాడు. 

Allu Arjun


నాగబాబు ఎలక్షన్ ముగిసిన వెంటనే ప్రత్యర్థులకు పని చేసేవాడు మా వాడు కాదని కామెంట్ పోస్ట్ చేశాడు. మెగా ఫ్యామిలీకి చెందిన నాగబాబు, సాయి ధరమ్ పరోక్షంగా తమ వ్యతిరేకత వ్యక్తం చేశారు. కాగా పవన్ కళ్యాణ్ తో వైరం అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ పుష్ప 2 పై ప్రభావం చూపుతుందని సంచలన కామెంట్స్ చేశాడు దర్శకుడు గీతాకృష్ణ... 
 

Allu Arjun-Nagababu

ఆయన మాట్లాడుతూ... అల్లు అరవింద్ స్టార్ ప్రొడ్యూసరే కావచ్చు... అల్లు అర్జున్ మాత్రం సినిమాలు, రాజకీయాల్లో బచ్చా. అల్లు అరవింద్ కి చిరంజీవి అనే బంగారు బాతు దొరికింది. ఆ గుడ్లు అమ్ముకుని స్టార్ ప్రొడ్యూసర్ అయ్యాడు. నెక్స్ట్ జనరేషన్ పెద్దల్లో స్వార్థం ఏర్పడటం సహజమే. అల్లు అర్జున్ మంచి నటుడు కావడం వలన రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో పోటీ పడుతున్నాడు, అని అన్నాడు. 
 

ఇంకా మాట్లాడుతూ...  ప్లాన్డ్ గా చేసిన కొన్ని సినిమాలు సక్సెస్ కావడం. పుష్ప తో పాన్ ఇండియా ఇమేజ్ రావడంతో పాటు గతంలో ఎవరికీ దక్కని నేషనల్ అవార్డు రావడంతో అల్లు అర్జున్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. అల్లు అరవింద్ పద్ధతులు పవన్ కళ్యాణ్ కి నచ్చవు. అలాగే పవన్ ని అల్లు అరవింద్ చిన్నప్పటి నుండి చులకనగా చూసేవాడు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో అల్లు అరవింద్ చాలా డబ్బు వెనకేసుకున్నాడు. 

తన తండ్రితో పవన్ కళ్యాణ్ వ్యవహరించే తీరును అల్లు అర్జున్ మనసులో పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ తో వివాదం అల్లు అర్జున్ అప్ కమింగ్ మూవీ పుష్ప 2 పై పడుతుంది. పదేళ్లుగా పవన్ కళ్యాణ్ పార్టీ కోసం కష్టపడుతుంటే ఎప్పుడో పబ్ లో పరిచయమైన శిల్పా రవి కోసం ఎగేసుకుని వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్ అవుతాడని అల్లు అర్జున్ ఊహించలేదు. అల్లు అర్జున్ ఇప్పటికైనా మెగా ఫ్యామిలీతో సంధి చేసుకుంటే మంచిదని... దర్శకుడు గీతాకృష్ణ చెప్పుకొచ్చాడు.. 

Latest Videos

click me!