అల్లు అర్జున్‌ నెక్ట్స్ భారీ సినిమాల లైనప్‌.. రూ. 2600 కోట్ల బడ్జెట్‌, ఇదెక్కడి మాస్

Published : Apr 08, 2026, 05:45 PM IST

Allu Arjun Lineup: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఇప్పుడు `రాకా` చిత్రంతో రాబోతున్నారు. ఆయన చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. ఆయన పేరుతో వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది.  

PREV
15
అల్లు అర్జున్‌ పేరుతో రూ.2600కోట్ల వ్యాపారం

అల్లు అర్జున్‌ భారీ లైనప్‌తో ఉన్నారు. ఇప్పుడు అట్లీ మూవీ చేస్తోన్న ఆయన మరో మూడు సినిమాలను లైన్‌లో పెట్టారు. వారి బడ్జెట్లు అన్నీ కలిపి ఏకంగా రూ.2600కోట్లు కావడం విశేషం.  ఇలా ఇప్పుడు టాలీవుడ్‌లోనే బన్నీ పేరుతో భారీ వ్యాపారం జరుగుతుంది.

25
రాకా మూవీ బడ్జెట్‌

అల్లు అర్జున్‌, అట్లీ కాంబినేషన్‌లో 22వ మూవీగా `రాకా` రూపొందుతుంది. ఈ చిత్రం బడ్జెట్‌ ఏకంగా రూ.800కోట్లు అని సమాచారం. దీన్ని అంతర్జాతీయ మూవీగా రూపొందిస్తున్నారు. సన్‌ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇందులో దీపికాపదుకొనె, రష్మిక మందన్నా వంటి ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. 

35
లోకేష్‌ కనగరాజ్‌తో మూవీ బడ్జెట్‌

లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌ లో భాగంగా అల్లు అర్జున్ తో మూవీ చేస్తున్నారు. ఈ మూవీ రూ.500 కోట్ల బడ్జెట్‌తో రూపొందబోతుంది. లోకేష్‌ మార్క్ యాక్షన్‌, స్టయిల్‌, థ్రిల్లర్‌, ఎమోషనల్‌గా ఈ మూవీ ఉండబోతుందట. దీనిపై భారీ అంచనాలున్నాయి. త్వరలోనే ఈ సినిమాని ప్రారంభించనున్నారు.

45
వెయ్యికోట్లతో త్రివిక్రమ్‌ మూవీ

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ పురాణాల నేపథ్యంలో సాగుతుంది. ఏఏ 24గా తెరకెక్కనున్న ఈ మూవీకి వెయ్యి కోట్ల బడ్జెట్‌ అని సమాచారం. కుమారస్వామి కథతో సినిమా రూపొందుతుందని సమాచారం. భారీ పౌరాణిక చిత్రంగా దీన్ని తెరకెక్కించే పనిలో త్రివిక్రమ్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

55
బాసిల్‌ జోసెఫ్‌ మూవీ బడ్జెట్‌

'మిన్నల్ మురళి' దర్శకుడు బాసిల్ జోసెఫ్‌ దర్శకత్వంలో ఓ మూవీ(ఏఏ25) చేస్తున్నారు అల్లు అర్జున్. దీన్ని రూ.300 కోట్ల బడ్జెట్‌తో గీతా ఆర్ట్స్ నిర్మించనుంది. ఇలా నాలుగు సినిమాల బడ్జెట్‌ ఏకంగా రూ.2600కోట్లు కావడం విశేషం. ఇప్పుడు అల్లు అర్జున్‌ పేరుతో సుమారు మూడు వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని చెప్పొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories