డ్యాన్స్, యాక్టింగ్, బోల్డ్ కామెంట్స్ తో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది రాఖీ సావంత్. సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ గా ఉన్న ఆమె.. 50 రూపాయలతో స్టార్ట్ అయ్యి..50 కోట్లకు ఎలా ఎదిగిందో తెలుసా?
రాఖీ సావంత్ 1978, నవంబర్ 25న మహారాష్ట్రలోని ముంబైలో పుట్టింది. ఆమె అసలు పేరు నీరూ భేడా. పేదరికం నుంచి వచ్చి టీవీ, సినిమాలు, సోషల్ మీడియాలో స్టార్‌గా ఎదిగిన ఆమె ప్రయాణం ఎందరికో స్ఫూర్తి.
26
11 ఏళ్ల వయసులోనే కుటుంబాన్ని పోషించడానికి
రాఖీ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పెరిగింది. చిన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. కేవలం 11 ఏళ్ల వయసులోనే కుటుంబాన్ని పోషించడానికి, తన కలల్ని నెరవేర్చుకోవడానికి రోజుకు ₹50 సంపాదనతో పని చేయడం మొదలుపెట్టింది. 1997లో 'అగ్నిచక్ర' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 'జోరు కా గులాం', 'జిస్ దేశ్ మే గంగా రెహతా హై' వంటి సినిమాల్లో చిన్న పాత్రలు, డ్యాన్స్ నంబర్లు చేసింది.
36
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్..
సినిమాల కన్నా రాఖీకి టీవీ, రియాలిటీ షోలతోనే ఎక్కువ పేరు వచ్చింది. 2006లో వచ్చిన బిగ్ బాస్ సీజన్ 1తో ఆమె దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. తన బోల్డ్ మాటలు, నిర్మొహమాటమైన వ్యక్తిత్వంతో షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ తర్వాత కూడా పలు సీజన్లలో గెస్ట్‌గా వచ్చి సందడి చేసింది.
'రాఖీ కా స్వయంవర్' అనే రియాలిటీ షోతో పాటు మరెన్నో షోలలో పాల్గొంది. దీంతో ఆమె ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల్లో నిత్యం నిలుస్తూ వచ్చింది. ఈ షోలు ఆమెను టీవీ రంగంలో ఒక పెద్ద స్టార్‌గా నిలబెట్టాయి.
56
రాఖీ సావంత్ రెమ్యునరేషన్.. ఆస్తి
ఒకప్పుడు రోజుకు ₹50 సంపాదించిన రాఖీ సావంత్, ఇప్పుడు నెలకు సుమారు ₹50 లక్షలు సంపాదిస్తోంది. మీడియా కథనాల ప్రకారం, ఆమె మొత్తం ఆస్తి విలువ దాదాపు ₹50 కోట్లు. టీవీ షోలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, సోషల్ మీడియా, ఈవెంట్లలో ప్రదర్శనల ద్వారా ఆమెకు ఈ ఆదాయం వస్తుంది. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా కూడా భారీగా సంపాదిస్తోంది.
66
విలాసవంతమైన జీవితం
రాఖీ తన సంపాదనతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది. ముంబైతో పాటు విదేశాల్లోనూ ఆమెకు ఖరీదైన ఇళ్లు ఉన్నాయని సమాచారం. ఆమె వద్ద లగ్జరీ కార్ల కలెక్షన్ కూడా ఉంది. రాఖీ సావంత్‌ను చాలామంది 'టీవీ డ్రామా క్వీన్' అని పిలుస్తారు. ఆమె ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండదు.
తన బోల్డ్ కామెంట్స్, డ్రెస్సింగ్ స్టైల్‌తో ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. అయితే, ఆమెలోని ఈ నిజాయితీ, బోల్డ్‌నెస్ వల్లే ఆమెను ఇష్టపడేవాళ్లు కూడా చాలామందే ఉన్నారు. కష్టపడితే ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఎలా ఎదగవచ్చో చెప్పడానికి రాఖీ జీవితమే ఒక ఉదాహరణ.