pushpa 3కి కమిట్‌ అయిన అల్లు అర్జున్‌, సుకుమార్‌..? రిలీజ్‌ అప్పుడే.. బాలీవుడ్‌ స్టార్‌ని దించుతున్నారా?

Published : Mar 05, 2024, 10:58 PM IST

`పుష్ప` అభిమానులకు మరో గుడ్‌ న్యూస్‌ వచ్చింది. ఈ మూవీకి మరో సీక్వెల్‌ ఉండబోతుందట. ఇదే ఇప్పుడు సోషల్‌ మీడియాని ఊపేస్తుంది.రిలీజ్‌ డేట్‌ కూడా చక్కర్లు కొడుతుంది.   

PREV
15
pushpa 3కి కమిట్‌ అయిన అల్లు అర్జున్‌, సుకుమార్‌..? రిలీజ్‌ అప్పుడే.. బాలీవుడ్‌ స్టార్‌ని దించుతున్నారా?
pushpa2

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్, సుకుమార్‌ కాంబినేషన్‌లో ఇప్పుడు భారీ బడ్జెట్‌ తో `పుష్ప 2` రూపొందుతుంది. మూడేళ్ల క్రితం వచ్చిన `పుష్ప`కి రెండో పార్ట్ గా ఈ మూవీ రాబోతుంది. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఇంకా షూటింగ్‌ కూడా పూర్తి కాలేదు. కానీ ఈ సినిమాకి సంబంధించిన ఓ క్రేజ్‌ న్యూస్‌ సోషల్‌ మీడియాని ఊపేస్తుంది. 

25

`పుష్2`కి మరో సీక్వెల్‌ ఉంటుందనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతుంది. ఆ మధ్య ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ అల్లు అర్జున్‌.. ఈ విషయాన్ని స్పష్టం చేశారు. `పుష్ప 3` ఉండొచ్చు, ఇంకా చాలా పార్ట్ లు కూడా చేయోచ్చు అన్నారు. మూడో పార్ట్ ఉంటుందని చెప్పకనే చెప్పారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. 
 

35

లేటెస్ట్ సమాచారం మేరకు `పుష్ప 3` కూడా ఉండబోతుందట. అల్లు అర్జున్‌, సుకుమార్‌ మూడో పార్ట్ తీయాలని ఫిక్స్ అయ్యారు. `పుష్ప 2` కి సంబంధించిన కంటెంట్‌ చూసుకున్నాక, పార్ట్ 3 కచ్చితంగా అవసరం అని భావించారట. దీంతో `పుష్ప 3`ని కూడా తెరకెక్కించాలని భావిస్తున్నారట. అంతేకాదు ఔట్‌పుట్‌ చూసుకున్నాక ఈ మూవీని కచ్చితంగా ఆగస్ట్ 15కి విడుదల చేయాని నిర్ణయించుకున్నారట. డేట్‌ని మార్చేది లేదని ఫిక్స్ అయ్యారట. 
 

45

మరోవైపు ఆ మూవీ విడుదలైన వెంటనే షూటింగ్‌ చేయనున్నారట. `పుష్ప2`తోపాటే మూడో పార్ట్ కి సంబంధించిన మేజర్‌పోర్షన్‌ సీన్లు చిత్రీకరిస్తారట. `పుష్ప 2` రిలీజ్ అయ్యాక మూడో పార్ట్ కి సంబంధించిన మిగిలిన పార్ట్ ని షూట్‌ చేయాలని అనుకుంటున్నట్టు సమాచారం. ఈ మేరకు రిలీజ్‌ డేట్‌ విషయంలోనూ ఓ క్లారిటీకి వచ్చారట. వచ్చే ఏడాది సమ్మర్‌లో `పుష్ప 3` రిలీజ్‌ చేయాలనుకుంటున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

55

ఈ మూవీకి సంబంధించిన నెక్ట్స్ షెడ్యూల్‌ మార్చి 8నుంచి ప్రారంభం కాబోతుంది. వైజాగ్‌లో చిత్రీకరిస్తారట. ఇందులో అల్లు అర్జున్‌ కూడా పాల్గొంటారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో మరో బిగ్‌ స్టార్‌ యాడ్‌ కాబోతున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్‌ దత్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. డాన్‌ పాత్రలో `పుష్ప 2`లోనే ఆయన పాత్ర ఉంటుందని తెలుస్తుంది. ఇందులో నిజమెంతో తెలియాలి. ఇక రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న `పుష్ప2`లో ఫహద్‌ ఫాజిల్‌ నెగటివ్‌రోల్‌ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 15న ఈ మూవీని పాన్‌ ఇండియా స్కేల్‌లో రిలీజ్‌ చేస్తున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories