NTR: బాలీవుడ్‌లో స్ట్రెయిట్‌ మూవీ కన్ఫమ్‌?.. ఎన్టీఆర్‌ ప్లాన్‌ వర్కౌట్‌ అయినట్టే!

First Published | Mar 5, 2024, 8:21 PM IST

ఎన్టీఆర్‌ నెక్ట్స్ సినిమాల లైనప్‌ మామూలుగా లేదు. ఆయన సైలెంట్‌గా భారీ లైనప్‌ని సెట్‌ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక ఇప్పుడు తారక్‌ ప్లాన్‌ వర్కౌట్‌ అయ్యే సమయం వచ్చింది. 
 

ఎన్టీఆర్‌ మొన్నటి వరకు తెలుగు హీరోగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ `ఆర్‌ఆర్‌ఆర్‌`తో ఆయన ఇమేజ్‌ పాన్‌ ఇండియా దాటింది. ఇతర దేశాల ఆడియెన్స్ ఆయన నటనకు కనెక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం పాన్‌ ఇండియన్‌ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. కానీ పూర్తి స్థాయిలో ఆయనకు ఆ ఇమేజ్‌ రాలేదు. `దేవర` మూవీతో పాన్‌ ఇండియాలో సత్తా చాటబోతున్నారు తారక్‌. ఈ మూవీని భారీగా ప్లాన్‌ చేస్తున్నారు. సినిమా హిట్‌ అయితే ఆయన బాలీవుడ్‌తోపాటు తమిళం, కన్నడ, మలయాళ ఆడియెన్స్ కి కూడా దగ్గరవుతాడని చెప్పొచ్చు. 

అయితే ఎన్టీఆర్‌ తన నెక్ట్స్ సినిమాల విషయంలో ఓ ప్లానింగ్‌తో వెళ్తున్నాడు. తాను ముందుచూపుతో సినిమాలు చేస్తున్నాడు. ఈ మేరకు ఓ టార్గెట్‌ని కూడా ఫిక్స్ చేసుకున్నాడు. ఆ టార్గెట్‌ని అందుకునే దిశగా వెళ్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ అదిరిపోయే వార్త సోషల్‌ మీడియాలో వినిపిస్తుంది. తారక్‌ నెక్ట్స్ స్ట్రెయిట్‌ బాలీవుడ్‌ మూవీ చేయబోతున్నారని తెలుస్తుంది. ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. 


యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR)  ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. వరల్డ్ వైడ్ క్రేజ్ దక్కడంతో పాటు  దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. RRR క్రియేట్ చేసిన సెన్సేషన్ కు తారక్ రాబోయే చిత్రాలపై భారీఅంచనాలు నెలకొన్నాయి. అందుకు తగట్టుగానే ఎన్టీఆర్ ప్రాజెక్ట్స్ రూపుదిద్దుకుంటున్నాయి. 
 

ఏ హీరో అయినా నార్త్ మార్కెట్‌లో పాగా వేస్తే ఇక తిరుగులేదు. ప్రభాస్‌ నార్త్ లో సత్తా చాటాడు. అక్కడి ఆడియెన్స్ కి దగ్గరయ్యాడు. కేజీఎఫ్‌ స్టార్‌ యష్‌ కి సైతం బాగానే మార్కెట్‌ ఏర్పడింది. తెలుగు నుంచి బన్నీ, తారక్‌ ఆ మార్కెట్‌ కోసం ప్రయత్నం చేస్తున్నారు. రామ్‌చరణ్‌ కూడా ఈ ట్రాక్‌లోనే ఉన్నాడు. అయితే ఎన్టీఆర్‌ మాత్రం బాలీవుడ్‌ నటుడిగా మారే ప్రయత్నం చేస్తున్నారు. నార్త్ ఆడియెన్స్ `తారక్‌ మా హీరో` అని పిలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు అడుగులు పడుతున్నాయి. 
 

war2

తారక్‌ ఇప్పటికే హిందీలో `వార్‌ 2`లో నటించేందుకు ఓకే చెప్పాడు. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించే ఈ మూవీ షూటింగ్‌లో తారక్‌ త్వరలోనే పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో ఆయన స్పై ఏజెంట్‌గా కనిపిస్తాడట. ఆయన పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయని తెలుస్తుంది. పాజిటివ్‌గానే కాదు, నెగటివ్‌ షేడ్స్ కూడా కనిపిస్తాయని అంటున్నారు. ఇది యష్‌ రాజ్‌ఫిల్మ్స్ రూపొందిస్తున్న స్పై యూనివర్స్ ఫిల్మ్ లో ఒకటి. ఇందులో హృతిక్‌రోషన్‌ హీరోగా నటిస్తున్నారు. 

దీంతోపాటు మరో స్పై యూనివర్స్ మూవీ చేస్తున్నారట తారక్‌. అయితే ఇది ఆయనకు పూర్తి స్ట్రెయిట్‌ మూవీ అని సమాచారం. స్పై యూనివర్స్ సిరీస్‌లోనే మరో సినిమాని తెరకెక్కించబోతున్నారట. ఇందులో ఎన్టీఆర్‌ సోలో హీరోగా నటిస్తారని తెలుస్తుంది. దీనికి ఆయన సైన్‌ చేసినట్టు, ఈ ప్రాజెక్ట్ కన్ఫమ్‌ అయినట్టు ప్రచారం జరుగుతుంది. దీన్ని కూడా యష్‌ రాజ్‌ ఫిల్మ్స్ నిర్మించబోతుంది. `వార్‌ 2` పూర్తయిన తర్వాత ఈ మూవీ స్టార్ట్ అవుతుందట. `వార్‌ 2`లో నటించిన పాత్రనే కొనసాగించబోతున్నట్టు తెలుస్తుంది. మరి నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 
 

ప్రస్తుతం ఎన్టీఆర్‌.. కొరటాల శివ దర్శకత్వంలో `దేవర` సినిమాలో నటిస్తున్నాడు. యాక్షన్‌ థ్రిల్లర్ మూవీ ఇది. పోర్ట్ ప్రధానంగా సముద్రపు బ్యాక్‌ డ్రాప్‌లో సాగుతుందట. ఇందులో ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. ఇందులో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. మరో మరాఠి హీరోయిన్‌ పేరు వినిపిస్తుంది. సైఫ్‌ అలీ ఖాన్‌ ఇందులో విలన్‌ పాత్ర పోషిస్తుండగా, కళ్యాణ్‌ రామ్‌, సుధాకర్‌ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీని దసరా కానుకగా అక్టోబర్‌ 10న విడుదల చేయబోతున్నారు. ఇది రెండు భాగాలుగా రాబోతుంది. 
 

Latest Videos

click me!