ఆర్తి అగర్వాల్‌ కెరీర్‌ నాశనం అవడానికి కారణాలు.. ఒకటి కాదు రెండు కాదు దెబ్బ మీద దెబ్బ..

Published : Mar 05, 2024, 09:32 PM IST

అందాల తార ఆర్తి అగర్వాల్‌.. ప్రారంభంలో ఓ వెలుగు వెలిగింది. కానీ అంతలోనే డౌన్‌ అయ్యింది. మరి ఆమె కెరీర్‌ నాశనం కావడానికి కారణాలేంటో తెలుసా?  

PREV
17
ఆర్తి అగర్వాల్‌ కెరీర్‌ నాశనం అవడానికి కారణాలు.. ఒకటి కాదు రెండు కాదు దెబ్బ మీద దెబ్బ..

ఆర్తి అగర్వాల్‌.. ఒకప్పటి అందాల తార. ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించి మెప్పించింది. హీరోయిన్‌ అంటే ఇలానే ఉండాలనే లెక్కలు మార్చేసిన బ్యూటీ. సొట్టబుగ్గల అందంతో టాలీవుడ్‌ ఆడియెన్స్ ని మెస్మరైజ్‌ చేసింది. దాదాపు పదేళ్ల పాటు టాలీవుడ్‌ని ఊపేసింది. అనుష్క, శ్రియా, నయనతార వంటి స్టార్‌ భామల జోరు సాగుతున్న సమయంలోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని, ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకుంది. లవ్‌ స్టోరీలకు కేరాఫ్‌గా నిలిచింది. అదే సమయంలో `ఇంద్ర` లో మాస్‌ రోల్‌తోనూ మెప్పించింది. 

27

కెరీర్‌ పీక్‌లో ఉన్న సమయంలోనే ఆర్తి అగర్వాల్‌ ట్రాక్‌ తప్పింది. సినిమాలు తగ్గిపోయాయి. అనారోగ్య సమస్యలు వచ్చాయి. ఒక్కసారిగా ఆమె డౌన్‌ అయిపోయింది. అంతలోనే కనుమరుగయ్యింది. ఆర్తి అగర్వాల్‌ 2015 జూన్‌ 6న కన్నుమూసింది. అభిమానులను సోకసంద్రంలో ముంచేసింది. అయితే నేడు ఆర్తి అగర్వాల్‌ జయంతి. 1984లో అమెరికాలో జన్మించింది ఆర్తి. ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చింది. 2001లో `నువ్వు నాకు నచ్చావ్‌` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. 
 

37

తరుణ్‌తో `నువ్వు లేక నేను లేను`, ఎన్టీఆర్‌తో `అల్లరి రాముడు`, చిరంజీవితో `ఇంద్ర`, ఉదయ్‌ కిరణ్‌తో `నీ స్నేహం`, బాలకృష్ణతో `పల్నాటి బ్రహ్మనాయుడు`, వెంకీతో `వసంతం`, రవితేజతో `వీడే`, నాగార్జునతో `నేనున్నాను`, ప్రభాస్‌తో `అడవి రాముడు`, వెంకీతో `సంక్రాంతి`, తరుణ్‌తో `సోగ్గాడు`, సునీల్‌తో `అందాల రాముడు`, రాజశేఖర్‌తో `గోరింటాకు` వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఐదారేళ్లు ఆమె కెరీర్‌ పీక్‌లో నడించింది. బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్లు అందుకుంది. స్టార్‌ హీరోయిన్‌ అయ్యింది. 
 

47

ఆ తర్వాత నెమ్మదిగా అవకాశాలు తగ్గాయి. ఏడాదికి ఒకటిరెండుసినిమాలు, కొన్నిసార్లు అసలే రాలేదు. మరి ఆర్తి అగర్వాల్‌ కెరీర్‌ నాశనం అవ్వడానికి కారణాలు చాలానే ఉన్నాయి. వాటిలో ఒకటి ప్రేమ. తరుణ్‌ తో ఆమె వరుసగా రెండు  సినిమాలు చేసింది. `నువ్వు లేక నేను లేను` సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. ప్రేమ కారణంగా ఇద్దరు సినిమాలు చేయలేదు. అవకాశాలు కూడా తగ్గాయి. కానీ ఆ ప్రేమ బెడిసి కొట్టింది. పేరెంట్స్ వరకు వెళ్లడంతో నిబంధనలు పెట్టడం స్టార్ట్ చేశారు. 
 

57

రెండోది తండ్రి కారణం.. ఆర్తి అగర్వాల్‌ కెరీర్‌ నాశనం కావడానికి ఆమె తండ్రినే ఓ కారణమట. ఆయన ప్రతి సినిమా షూటింగ్‌కి వచ్చేవాడు, రూల్స్ పెట్టావాడట. అది సినిమా షూటింగ్‌ల్లో అందరికి ఇబ్బందిగా ఉండేదని, ఆర్తి కూడా చాలా ఇబ్బంది పడేదని, సరైన ఔట్‌పుట్‌ వచ్చేది కాదని, దీంతో అవకాశాలు కూడా తగ్గిపోయాయని నిర్మాత చంటి అడ్డాల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఆర్తి కెరీర్‌ ఫేడౌట్‌కి తండ్రి కూడా ఓ కారణమని తెలిపారు. 
 

67

ఆర్థిక ఇబ్బందులు కూడా ఓ కారణంగా చెప్పొచ్చు. తరుణ్‌ తో ప్రేమ విఫలయమ్యింది.  సినిమాలు తగ్గాయి. ఆర్థిక ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి. ఇంట్లో పేరెంట్స్ నుంచి ఒత్తిడి పెరిగింది. ఇవన్నీ ఆమెపై ఒత్తిడిపెంచాయి. ఇది డిప్రెషన్‌కి కారణమయ్యింది. అనంతరం ఆమె ఆత్మహత్యకి పాల్పడాల్సి వచ్చింది. 

77

2005లో ఆత్మహత్యకు పాల్పడింది. దాన్నుంచి కోలుకున్నాక ఉజ్వల్‌ కుమార్‌ని పెళ్లి చేసుకుంది. రెండేళ్లకే ఆయన్నుంచి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత మళ్లీ కెరీర్‌ని మొదలు పెట్టింది. అయితే బరువు పెరిగిన ఆర్తి బరువు తగ్గించుకునే క్రమంలో అనేక రకాల ట్రీట్‌మెంట్‌ తీసుకుంది. కానీ అమె ఆరోగ్యంపైనే ప్రభావం చూపించింది. చివరికి అది హార్ట్ ఎటాక్‌కి దారి తీసింది. తొమ్మిదేళ్ల క్రితం ఆమె హఠాన్మరణం చెందింది. ఆమె మరణించిన సినిమాలతో ఇప్పటికీ ఆడియెన్స్ గుండెల్లో ఉంది ఆర్తి అగర్వాల్‌.  

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories