విడుదలకు ముందే రికార్డుల వేట షురూ... పుష్ప 2 టీజర్ కి విశేష స్పందన!

Published : Apr 09, 2024, 05:20 PM IST

అల్లు అర్జున్ పుట్టినరోజు పురస్కరించుకుని పుష్ప 2 టీజర్ విడుదల చేశారు. దానికి నేషనల్ వైడ్ భారీ ఆదరణ దక్కుతుంది. రికార్డ్ వ్యూస్ రాబడుతుంది.   

PREV
15
విడుదలకు ముందే రికార్డుల వేట షురూ... పుష్ప 2 టీజర్ కి విశేష స్పందన!

పుష్ప అల్లు అర్జున్ ఇమేజ్ ని తారాస్థాయికి చేర్చిన చిత్రం. 2021లో విడుదలైన ఈ చిత్రం అల్లు అర్జున్ కి పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిపెట్టింది. నార్త్ ఇండియాలో అల్లు అర్జున్ కి పాపులారిటీ తెచ్చింది. పుష్ప వరల్డ్ వైడ్ రూ. 350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా హిందీ వెర్షన్ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. పుష్ప చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న పుష్ప 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. 

 

25
Pushpa 2 teaser

కాగా అల్లు అర్జున్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 8న పుష్ప 2 టీజర్ విడుదల చేశారు. జాతరలో అమ్మవారి గెటప్ లో ఉన్న అల్లు అర్జున్ స్క్రీన్ ప్రెజెన్స్ గూస్ బంప్స్ లేపింది. భారీ యాక్షన్ ఎపిసోడ్ కి సంబందించిన ఈ వీడియో అద్బుతంగా ఉంది. కాగా పుష్ప 2 టీజర్ నిడివి తక్కువే అయినప్పటికీ అభిమానులను కట్టిపడేసింది. 

35
Pushpa 2 teaser


దీంతో పుష్ప 2 టీజర్ కి విశేష ఆదరణ దక్కుతుంది. యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతున్న పుష్ప 2 టీజర్ ఇప్పటికే 85 మిలియన్ వ్యూస్ రాబట్టింది. 1.2 మిలియన్ లైక్స్ అందుకుంది. పుష్ప 2 చిత్రం  కోసం ఆడియన్స్ ఎంతలా ఎదురుచూస్తున్నారో చెప్పేందుకు టీజర్ కి వస్తున్న ఆదరణ ఉదాహరణ అని చెప్పొచ్చు. 

45

దర్శకుడు సుకుమార్ పుష్ప 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దాదాపు రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించారు. అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందాన నటిస్తుంది. రష్మిక  బర్త్ డే కానుకగా ఆమె లుక్ కూడా రివీల్ చేసిన సంగతి తెలిసిందే.
 

55

పుష్ప 2 చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 15న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల కానుంది. అనసూయ, సునీల్, ఫహద్ ఫాజిల్ వంటి నటులు కీలక పాత్రలు చేస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories