‘పుష్ప 2’కి అల్లు అర్జున్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా? షాకింగ్

First Published | Oct 26, 2024, 8:05 AM IST

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న 'పుష్ప: ది రూల్' డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ భారీ పారితోషికం అందుకోనున్నట్లు సమాచారం.

Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2


 అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ‘పుష్ప ది రూల్‌’ (Pushpa The Rule). ‘పుష్ప ది రైజ్‌’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే  

అభిమానుల కోరిక మేరకు అనుకున్న డేట్‌ (డిసెంబర్‌ 6) కంటే ఒక రోజు ముందే (డిసెంబర్‌ 5) దీనిని విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. దీనిపై బన్నీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో చిత్రానికి భారీ బిజినెస్ జరుగుతోంది. అలాగే ఈ సినిమా నిమిత్తం అల్లు అర్జున్ కు ఎంత రెమ్యునరేషన్ అందనుందనే విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది.

Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2


ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ‘పుష్ప’ తీర్చిదిద్దారు. కూలీగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన పుష్పరాజ్‌.. ఎర్రచందనం సిండికేట్‌ను శాసించే స్థాయికి ఎలా వెళ్లాడనే ఆసక్తికర అంశాలతో ‘పుష్ప ది రైజ్‌’ చిత్రీకరించారు. ఆ తర్వాత అతడికి ఎదురైన ఇబ్బందులు ఏమిటి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అనే అంశాలతో ‘పుష్ప ది రూల్‌’ సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఇది షూటింగ్ దశలో ఉంది.



ఈ చిత్రం నిమిత్తం అల్లు అర్జున్ కు భారీగానే రెమ్యునరేషన్ ముట్టనుంది. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం వెయ్యి కోట్ల దాకా  ప్రీ రిలీజ్ చేసింది. నాన్ థియేటర్ బిజినెస్ తో మేకింగ్ కాస్ట్ మాగ్జిమం రికవరీ అయ్యిపోయింది. దాంతో భారీ లాభాలు వచ్చాయి.

ఇక  ఈ చిత్రం నిమిత్తం సుకుమార్, అల్లు అర్జున్ పార్టనర్స్ గా రెమ్యునేషన్ తీసుకోవాలని మొదటే ఎగ్రిమెంట్ చేసుకున్నారు. దాంతో అల్లు అర్జున్ కు 300 కోట్లు దాకా రెమ్యునరేషన్ అందినట్లు తెలుస్తోంది. తెలుగు హీరోలు ఇది భారీ మొత్తం. ఇప్పటిదాకా ఏ హీరోకు ఈ స్దాయి రెమ్యునరేషన్ అందుకోలేదు. 

allu arjun movie Pushpa2 The Rule release on december 5th


 పుష్ప ది రూల్ ఇతర భాషల  డిస్ట్రిబ్యూటర్లు వివరాలు పరిశీలిస్తే  కర్ణాటక – లక్ష్మీ కాంత్ రెడ్డి n సినిమాస్, కేరళ – (ముఖేష్ మెహతా) ఈ 4 ఎంటర్టైన్మెంట్స్ , హిందీ – బెంగాలీ – ఏ ఏ ఫిలింస్ అనిల్ తడానీ, తమిళ్ – ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ద్వారా రిలీజ్ కానుంది.


తమిళ డిస్ట్రిబ్యూటర్ మాట్లాడుతూ : తమిళనాడులో గోట్ రిలీజ్ చేసినన్ని థియేటర్లలో పుష్పా -2  రిలీజ్ చేస్తాంమని బాహుబలి -2 రికార్డ్స్ క్రాస్ అవుతుంది’ అని అన్నారు. ముఖేష్ మెహతా మాట్లాడుతూ : కేరళలో రూ. 12 కోట్లతో డే – 1రికార్డు బద్దలు కొడుతుందని నమ్ముతున్నాం.. కేరళలలో 24 గంటలు సినిమా స్క్రీన్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాం’


మైత్రి శశి : నైజాంలో ముందుగా షోస్ ప్లాన్ చేస్తున్నాం. నైజాం ఆల్ టైమ్ రికార్డ్ కొట్టబోతున్నాం. తెలుగులో ఎన్నడూ చూడని విధంగా భారీ రిలీజ్ చేస్తాం. అటు ఓవర్సీస్ లో పుష్ప – 2 ను డిసెంబరు 4న ప్రీమియర్స్ తో రిలీజ్ చేస్తున్నామని నిర్మాత నవీన్ అన్నారు. .

ఈ వారం పక్కాగా ఇంటికి వెళ్లే బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరు?


 ఒక రోజు ముందుగానే విడుదల చేయడానికి కారణం? చెప్తూ నిర్మాతలలో ఒకరైన నవీన్‌ మాట్లాడుతూ... యూఎస్‌లో బుధవారం నుంచి షోస్‌ ప్రారంభమైతే లాంగ్‌ వీకెండ్‌ కలిసొస్తుందనే ఉద్దేశంతో ముందుగా విడుదల చేయబోతున్నాం. ఇక్కడా ఒక రోజు ముందు విడుదలకావడం కలిసొచ్చే అంశం. అయినా ‘పుష్ప’ ఎప్పుడు విడుదలైతే అప్పుడే పండగ కదా! డిస్ట్రిబ్యూటర్లతో చర్చించి తీసుకున్న నిర్ణయమిది అన్నారు. 

Latest Videos

click me!