Allu Arjun-Atlee Movie: కొలీవుడ్ లో జీరో ఫ్లాప్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు అట్లీ. ఆయన ఇప్పటివరకు తమిళంలో దర్శకత్వం వహించిన `రాజా రాణి`, `తేరి`, `మెర్సల్`, `బిగిల్` చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించాయి.
ఆ చిత్రాల విజయం తర్వాత బాలీవుడ్ కి వెళ్లిన అట్లీ, షారుఖ్ ఖాన్ తో కలిసి `జవాన్` సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 2023 లో విడుదలై బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసింది. బాలీవుడ్ ని షేక్ చేసింది.