బాధపెట్టి ఉంటే క్షమించండి, వివాదంపై వివరణ ఇచ్చిన విజయ్ దేవరకొండ

Published : May 03, 2025, 01:28 PM IST

ఎట్టకేలకు వివాదంపై స్పందించారు విజయ్ దేవరకొండ. గిరిజనులను అవమానించారు అన్న ఆరోపణలు ఫేస్ చేస్తున్న విజయ్ దేవర కొండ, ఓసోషల్ మీడియా పోస్ట్ ద్వారా సుదీర్ఘ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన పేజ్  లో ఓ వివరణ లేఖను ఆయన రిలీజ్ చేశారు. ఇంతకీ అందులో విజయ్ ఏం రాశారు.? 

PREV
15
బాధపెట్టి ఉంటే క్షమించండి, వివాదంపై వివరణ ఇచ్చిన విజయ్ దేవరకొండ

కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండ  వివాదం ఇండస్ట్రీని కుదిపేస్తోంది. సూర్య నటించిన రెట్రో  సినిమా తెలుగు ఈవెంట్ లో విజయ్ నోరు జారి చేసిన కామెంట్స్ ప్రస్తుతం  మంటలు రేపుతున్నాయి. విజయ్ చేసిన వాఖ్యలు వైరల్ అవ్వడంతో పాటు వివాదాన్ని కూడా రేపాయి. రెట్రో ఈవెంట్ లో ఉగ్రవాద దాడి గురించి మాట్లాడుతూ ఆవేశంలో ట్రైబల్స్ గురించి నోరు జారాడు రౌడీ హీరో.  ఆయన అన్న మాటలకు ట్రైబ్స్ హార్ట్ అయ్యారు. అప్పటి నుంచి విజయ్ కు ఏదో ఒక రకంగా ఇబ్బందులు తప్పడంలేదు. 
 

25
Vijay Devarakonda

ఇక విజయ్ అప్పుడు ఏమన్నాడంటే..? ఐదారు వందల ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకుంటున్నట్టుగా ఉగ్రవాదులు ప్రవర్తిస్తున్నారంటూ విజయ్ మాట్లాడారు. దాంతో ఈ విషయంలో  ట్రైబల్ ఆర్గనైజేషన్స్ మండిపడ్డాయి. అంతే కాకుండా ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. సోషల్ మీడియాలో విజయ్ పై ట్రోలింగ్  గట్టిగా జరిగింది. దాంతో కాంట్రవర్సీ ముదిరి పాకానపడుతుండటంతో  విజయ్ దేవరకొండ స్పందిస్తూ సుధీర్ఘమైన  ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు.
 

35

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..‘రెట్రో ఈవెంట్లో నేను మాట్లాడిన మాటలతో కొంత మంది హర్ట్ అయ్యారనే విషయం నా దృష్టికి వచ్చింది. నేను ఆ విషయంపై సిన్సియర్‌గా క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎవ్వరినీ ఉద్దేశ్యపూర్వకంగా హర్ట్ చేయాలని అలా మాట్లాడలేదు..మన దేశ సమగ్రతలో భాగమైన ఎంతో ప్రత్యేకమైన గిరిజన తెగల్ని కించపర్చాలనేది నా ఉద్దేశం కాదు.. నేను ఆ రోజ మన దేశం గురించి.. మన దేశ ఐక్యత గురించి.. మనం ఎలా ముందుకు సాగాలి అన్న దాని గురించి మాత్రమే మాట్లాడాను అని అన్నారు. 
 

45
Vijay Devarakonda

అసలు నిజానికి ఆ సందర్భంలో  ట్రైబ్ అనే పదాన్ని నేను వేరే సెన్స్‌లో వాడాను. నాగరికత మొదలు కాక ముందు, క్లాన్స్, రాజ్యాలు అంటూ ఉండేవి.. అంతే కానీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి కాదు.. 20వ శతాబ్దంలో ఈ ట్రైబ్స్ పదాన్ని పెట్టారు..నా వల్ల, నా మాటల వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే క్షమించండి.. శాంతి గురించి, అభివృది గురించి, ఐక్యత గురించి మాత్రమే నేను మాట్లాడాను.. డివైడ్ చేయాలనేది నా ఉద్దేశం ఎప్పటికీ కానే కాదు.. ఐకమత్యం కోసమే నేను మాట్లాడాను’ అని అన్నాడు. 

55
Actor Vijay Devarakonda

ప్రవస్తుతం విజయ్ దేవరకొండ ఇచ్చిన క్లారిటీ మెసేజ్ వైరల్ అవుతోంది. ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే.. ఆమన ప్రస్తుతం కింగ్ డమ్ సినిమాలో నటిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈసినిమా రిలీజ్ కురెడీ అవుతోంది. ఈమూవీ నుంచి వచ్చిన టీజర్, సాంగ్, పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ సినిమా తరువాత రౌడీ జనార్ధన్ లో జాయిన్ కాబోతున్నాడు విజయ్. 

Read more Photos on
click me!

Recommended Stories