ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నతనం నుంచి ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ఎదిగాడు బన్ని. ఇక చిరంజీవి తరువాత బన్నీ అంతలా ప్రాణంగా ప్రేమించే మరో హీరో ఎవరో తెలుసా? ఐకాన్ స్టార్
ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా అల్లు అర్జున్ ఓ స్థాయిలో ఉన్నాడు. పుష్ప రెండు సినిమాలతో.. ఆయన రేంజ్ మారిపోయింది. ఈమధ్య కాలం వరకూ.. టాలీవుడ్ కే పరిమితం అయిన అల్లు అర్జున్ క్రేజ్.. పుష్ప సినిమాతో నార్త్ కు కూడా పాకింది. అక్కడ బన్నీకి భారీ స్థాయిలో ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఉత్తరాదిన అల్లు అర్జున్ కు అభిమానులు భారీగా పెరిగిపోయారు. ఆయన స్టైల్ ను కూడా ఎక్కువగా ఫాలో అవుతున్నారు. దాంతో అల్లు అర్జున్ కు పాన్ ఇండియా స్థాయిలో సినిమా ఆఫర్లు కూడా ఎక్కువగా వస్తున్నాయి.
25
మెగాస్టార్ అంటే అల్లు అర్జున్ కు ప్రాణం..
అల్లు అర్జున్ చిన్నతనం నుంచి మెగాస్టార్ ను ఆదర్శంగీ తీసుకుని ఎదుగుతూ వచ్చాడు. ఆయన స్టైల్, డ్యాన్స్, నటన చూస్తూ పెరిగాడు. బన్నీకి మొదటి నుంచి హీరో అంటే మెగాస్టారే. కొన్ని చిరంజీవి సినిమాల్లో కూడా అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సందర్భాలు ఉన్నాయి. నాకు మెగాస్టార్ అంటే ప్రాణం అని చాలా సందర్భాల్లో ఐకాన్ స్టార్ పబ్లిక్ గానే వెల్లడించారు. అయితే చిరంజీవి తరువాత బన్నీ అంతలా ప్రేమించే మరో హీరో ఎవరో తెలుసా? ఎవరో తెలిస్తే షాక్ అవుతారు.
35
చిరంజీవి తరువాత అల్లు అర్జున్ అభిమానించే హీరో..
అల్లు అర్జున్ కు మెగాస్టార్ తరువాత రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం. ఆ విషయాన్ని గతంలో అల్లు అర్జున్ వెల్లడించారు. ఓ సినిమా ఈవెంట్ లో మాట్లాడిన బన్నీ.. షాకింగ్ కామెంట్స్ చేశారు. అల్లుఅర్జున్ మాట్లాడుతూ.. '' మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నా ప్రాణం.. నా ప్రాణం కంటే ఎక్కువ.. నేను నెంబర్ వన్ గా చూడాలి అనుకున్న నా హీరో.. నా కోరిక అది.. ఒక హీరోగా నేను చెపుతున్నా.. నేను చరణ్ అభిమానిని.. నాకు చరణ్ అంటే పిచ్చి.. నాకు మెగాస్టార్ తరువాత ఆస్థాయిలో రామ్ చరణ్ నే చూడాలని ఆ ఆశ. అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా అంటే.. ఆయన ఆ రేంజ్ ను చూసేశారు.. ఇక ఆయన చూడటానికి అంతకు మించి ఏం లేదు. ఆయన చూడని రేంజా.. ఇక ఆ రేంజ్ కు చరణ్ వెళ్తున్నాడు.. పక్కాగా వెళ్తాడు.. నెక్ట్స్ 25 ఏళ్లు చరణ్ స్టార్ గా వెలుగు వెలగాలని మనస్పూర్తిగా కోరకుంటున్నాను'' అని అల్లు అర్జున్ అన్నారు.
ప్రస్తుతం మెగా అల్లు ఫ్యామిలీల మధ్య గ్యాప్ గురించి అందరికి తెలిసిందే. రెండు కుటుంబాల నుంచి ఎవరు ఈ విషయంలో డైరెక్ట్ కామెంట్స్ చేయకపోయినా.. జరుగుతున్న పరిణామాలను అందరు గమనిస్తూనే ఉన్నారు. ఎలక్షన్స్ టైమ్ లో జరిగిన గొడవల గురించి కూడా అందరికి తెలిసిందే. ఇక ఈమధ్య కాలంలో అల్లు శిరీష్ పెళ్లిలో ఈ రెండు కుటుంబాలు కలిసి సందడి చేశాయి. చరణ్, బన్నీ కూడా చాలా క్లోజ్ గా కనిపించారు. ఈ విషయం ఈ ఇద్దరు హీరోల అభిమానులను సంతోషపెట్టింది. ఇది ఇలానే కంటీన్యూ అవ్వాలని అభిమానులు కోరుకున్నారు.
55
అల్లు అర్జున్ ను అందుకోవడం కష్టమే..
బన్నీ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడు. పుష్ప రెండు సినిమాలు ఇండియన్ సినిమాను ఊపు ఊపేసి వదిలిపెట్టాయి.. ఇక అట్లీతో అల్లు అర్జున్ చేస్తోన్న సినిమాకు ఏకంగా 1000 కోట్ల వరకూ బడ్జెట్ పెడుతున్నట్టు సమాచారం. ఈ సినిమా ఇంటర్నేషనల్ స్టాండెట్స్ తో తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. ఈమూవీ తరువాత లోకేష్ కనకరాజ్ తో మరో భారీ ప్రాజెక్ట్ ను ముందే అనౌన్స్ చేశాడు అల్లు అర్జున్. మరో వైపు పుష్ప3 ని కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్.. ఈ లెక్కన్న అల్లు అర్జున్ ను సాధారణ దర్శకుడు అందుకోవడం ముందు ముందు కష్టమనే చెప్పాలి.