పుష్ప మొదటి భాగం హిందీలో ఊహించని విధంగా సక్సెస్ అయింది. పుష్ప 2పై నార్త్ లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కలసి చేసిన మ్యాజిక్ కి ఇండియా మొత్తం ఫిదా అయింది. పుష్ప మొదటి భాగం హిట్ కావడంతో పుష్ప 2 కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ కి సంబంధించిన సన్నాహకాలు జరుగుతున్నాయి.