అల్లు అర్జున్ కు ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు.. ఫస్ట్ సౌత్ ఇండియన్ యాక్టర్ గా గుర్తింపు.. వారికి అంకితం!

Published : Oct 13, 2022, 01:04 PM IST

‘పుష్ప’తో వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. బన్నీ నటనకు ప్రశంసలు కురుస్తుండగా.. తాజాగా ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు దక్కింది. ఈ అవార్డు అందుకున్న తొలి సౌత్ ఇండియన్ యాక్టర్ గా గుర్తింపు లభించింది.

PREV
16
అల్లు అర్జున్ కు ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు.. ఫస్ట్ సౌత్ ఇండియన్ యాక్టర్ గా గుర్తింపు.. వారికి అంకితం!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతేడాది విడుదలైన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘పుష్ప : ది రైజ్’ (Pushpa The Rise)తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. దేశ వ్యాప్తంగా గట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. పోయినేడు డిసెంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పుష్ప’ చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇంతటి ఘన విజయాన్ని అందుకున్న ఈ చిత్రం అవార్డులను సైతం కొల్లగొడుతోంది. 
 

26

‘పుష్ప’లో అల్లు అర్జున్ పెర్ఫామెన్స్ కు నేటికీ ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. టెక్నీషియన్స్ ను కూడా అభినందిస్తూనే ఉన్నారు.  ఇప్పటికే మ్యూజిక్ పరంగా ‘మిర్చి మ్యూజిక్ అవార్డ్స్’ను,  ఆయా కేటగిరిల్లో ‘సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్’(SIIMA Awards)ను కూడా అందుకుందీ చిత్రం. తాజాగా ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకున్న తొలి దక్షిణాది నటుడిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలిచారు. 
 

36

అల్లు అర్జున్ నటించిన బహుభాషా చిత్రం ‘పుష్ప : ది రైజ్‌’లో తన అద్భుతమైన నటనకు గాను ఎంటెర్టైనమెంట్ విభాగంలో CNN-News18 అందించే ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్‌’ (Indian Of the Year)గా ఎంపికయ్యాడు. చిత్ర పరిశ్రమలో 20 ఏళ్ల తర్వాత ఈ అవార్డు అందుకున్న తొలి సౌత్ ఇండియన్ యాక్టర్ గా బన్నీ గుర్తింపు పొందారు. బుధవారం ఢిల్లీలో అల్లు అర్జున్‌కు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ అవార్డును అందజేశారు. బన్నీ నటనకు గాను ప్రశంసించారు.  
 

46

అవార్డును స్వీకరించిన అనంతరం వేదికపై అల్లు అర్జున్ మాట్లాడారు. ‘భారతీయ సినిమా, ఇండియా కభీ ఝుకేగా నహిం (భారతీయ సినిమా, భారతదేశం ఎప్పటికీ తగ్గేదేలే) అంటూ పుష్ప రాజ్ చెప్పిన డైలాగ్‌ను అల్లు అర్జున్ తనదైన శైలిలో మరోసారి చెప్పారు. తను చిత్ర పరిశ్రమలో 20 ఏళ్లుగా పనిచేస్తున్నానని తెలిపారు. దక్షిణాదిలో ఎన్నో అవార్డులు అందుకున్నానని, ఉత్తరాది నుంచి అవార్డులు అందుకోవడం ఇదే తొలిసారి కావడంతో.. ఈ  అవార్డును చాలా ప్రత్యేకంగా భావిస్తున్నానని అన్నారు. బన్నీ స్పీచ్ కు ప్రముఖుల నుంచీ ప్రశంసలు అందాయి.
 

56

ఇక చిత్రం కరోనా మహమ్మారి సమయంలో విడుదలైనందున, అల్లు అర్జున్ ఈ అవార్డును ఫంట్ లైన్ వారియర్స్ అయిన డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు మరియు వాలంటీర్లకు అంకితం చేశారు. ప్రతి ఈవెంట్ లో తనదైన శైలిని చూపిస్తూ వ్యక్తిత్వం పరంగా మరింతగా ఎదుగుతుండటం విశేషం. దీంతో బన్నీ అభిమానులు కూడా ఖుషీ అవుతున్నారు. 
 

66

మూవీలోని ‘పుష్ప రాజ్’ మేనేరిజం, పాటలు, డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో ఇప్పటికీ ఏదోరకంగా సినిమా పేరు ట్రెండ్ అవుతూనే ఉంది. మొదటి పార్ట్ ఘన విజయం సాధించడంతో రూ.350 కోట్లతో పార్ట్ 2ను మరింత గ్రాండ్ గా తెరకెక్కించబోతున్నారు. ‘పుష్ప2’లోనూ అల్లు అర్జున్ - రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే సమంత, ప్రియమణి కూడా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. 

Read more Photos on
click me!

Recommended Stories