Fahadh Faasil Buys Ferrari Purosangue SUV: అల్లు అర్జున్ పుష్ప విలన్, స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కు కార్ల అంటే పిచ్చి. ఇప్పటికే తన గ్యారేజీలో పలు లగ్జరీ కార్లు ఉన్నాయి. తాజాగా మరో లగ్జరీ కారు కొనుగోలు చేస్తారు. ఇంతకీ కారు ఏంటీ? ధర ? ప్రత్యేకతలేంటీ?
Fahadh Faasil: దక్షిణాది స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ ఒకరు. మలయాళం, తెలుగు, తమిళ భాషలలో బ్యాక్-టూ-బ్యాక్ హిట్ సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూ దూసుకుపోతున్నారు. హీరోగానే కాకుండా విలన్ పాత్రల్లోనూ అదరగొట్టేశారు. ముఖ్యంగా అల్లు అర్జున్ పుష్ప సినిమాలో భన్వర్‌సింగ్ షెకావత్ అనే విలన్ పాత్రతో నటించి ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. అలాగే ఫహద్ ఇప్పుడు ఒక్కో సినిమాకు అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో ఒకరు. ఆ స్టార్ హీరో తాజాగా వార్తల్లో నిలిచారు. ఎందుకంటే?
25
ఫహద్ ఫాసిల్ గ్యారేజీలోకి మరో లగ్జరీ కారు
స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ తాజా కొత్త ఫెరారీ SUV పురోసంజ్వా (Purosangue) కొనుగోలు చేశారు. ఫెరారీ ప్రారంభించిన అత్యాధునిక పెర్ఫార్మెన్స్ SUV మోడల్ ఇది. ఈ కారు ధర ₹13.75 కోట్లు. ఈ కారు వేగం, లగ్జరీ ఫీచర్స్ అన్ని అత్యంత ప్రత్యేకం. తమిళ హీరో విక్రమ్, ముఖేష్ అంబానీ వంటి ప్రముఖులూ ఈ కొనుగోలు చేశారు. అలాగే.. కేరళలో ఈ కారును సొంతం చేసుకున్న మొదటి వ్యక్తిగా ఫహద్ నిలిచారు.
35
ప్రత్యేకతలు తెలిస్తే షాకవ్వాల్సిందే..
ఫెరారీ పురోసాంగ్యూ (Ferrari Purosangue)ఈ శ్రేణిలో మొట్టమొదటి ఎస్యూవీ ( SUV) ఇదే . ఇందులో 6.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 725bhpపవర్, 716 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. కేవలం 3.3 సెకన్లలో 100 kmph వేగాన్ని, 10.6 సెకన్లలో 0–200 kmph వేగం అందుకోగలదు. దీని గరిష్ట వేగం 310 kmph.SUVలో కార్బన్ సిరామిక్ బ్రేక్‌లు, యాక్టివ్ సస్పెన్షన్, ఫ్రంట్ యాక్సిల్ టార్క్ వెక్టరింగ్, వెనుక ఇ-డిఫరెన్షియల్, ఫోర్-వీల్ స్టీరింగ్ వంటి ఫీచర్స్ ఈ కారును ప్రత్యేకంగా మార్చుతున్నాయి. అందుకే ఈ కారు ఫెరారీలో ప్రత్యేక, లగ్జరీ SUVగా నిలుస్తుంది.
ఫహద్ గ్యారేజీలో ఇప్పటికే అనేక లగ్జరీ వాహనాలు ఉన్నాయి. ఇందులో లంబోర్గిని ఉరుస్, మెర్సిడెస్ G63 AMG, రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, ల్యాండ్ రోవర్ డిఫెండర్, పోర్స్చే 911 కారెరా, టయోటా వెల్‌ఫైర్, మినీ కంట్రీమ్యాన్, వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ GTI ఉన్నాయి. ఫహద్ లగ్జరీ ఆటోమొబైల్ కలెక్షన్ విషయంలో ప్రత్యేక గుర్తింపు పొందారు.
55
సినీ కెరీర్
ఫహద్ ఫాసిల్ తాజా చిత్రం ‘ఒడుం కుతిరా చదుం కుతిరా’ థియేటర్లలో రిలీజ్ అయింది. ఆషిక్ ఉస్మాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అల్తాఫ్ సలీమ్ దర్శకత్వం వహించారు. కథానాయికగా కళ్యాణి ప్రియదర్శన్ నటించగా రేవతి పిళ్లై, లాల్, సురేష్ కృష్ణ, బాబు ఆంటోని, జానీ ఆంటోని, లక్ష్మీ గోపాలస్వామి, అనురాజ్, వినీత్ వాసుదేవన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీకి జస్టిన్ వర్గీస్ సంగీతం సమకూర్చారు.