మెగా ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్, చిరంజీవి బర్త్ డే కోసం అనిల్ రావిపూడి ఏం ప్లాన్ చేస్తున్నాడంటే?

Published : Aug 05, 2025, 07:49 AM IST

ఆగష్టు 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు దగ్గరపడుతున్న కొద్ది మెగా అభిమానులలో హైప్ పెరిగిపోతోంది. ప్రతి ఏడాది తన బర్త్‌డేను ప్రత్యేకంగా మార్చే చిరు, ఈసారి కూడా కొత్త సినిమా అప్‌డేట్‌తో మెగా ఫ్యాన్స్‌ దిల్ ఖుష్ చేస్తారన్న ఆశతో ఉన్నారు. 

PREV
16

70 వ వసంతంలోకి చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి మెగాస్టార్ రేంజ్ కు ఎదిగారు. టాలీవుడ్ లో మెగా సామ్రాజ్యాన్ని స్థాపించారు చిరంజీవి. మెగా ఫ్యామిలీ నుంచి 10 మందికి పైగా నటీనటులు ఇండస్ట్రీలో ఉన్నారు. మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి నిర్మాతలు కూడా ఉన్నారు. ఇక త్వరలో మెగాస్టార్ చిరంజీవి 70 వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈనెల(అగస్ట్ 22)న ఆయన 70వ పుట్టినరోజును జరుపుకోబోతున్నారు. ఈక్రమంలో చిరంజీవి 7 పదుల వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

DID YOU KNOW ?
70వ వసంతంలోకి చిరంజీవి
ఈ ఏడాది అగస్ట్ 22 న మెగాస్టార్ చిరంజీవి 70వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ ఏజ్ లో కూడా ఫిట్ నెస్, డాన్స్ విషయంలో కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు చిరంజీవి.
26

తగ్గేదే లే అంటున్న మెగాస్టార్

మెగాస్టార్  చిరంజీవి ఈ వయస్సులో కూడా వరుసగా సినిమాలు చేస్తూ.. ఫిట్ నెస్ విషయంలో కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు చిరంజీవి. రీసెంట్ గా ఓ కార్యక్రమంలో ఆయన వేసిన చిన్న స్టెప్ వైరల్ అవుతోంది. బాడీని మెలికలు తిప్పుతూ, అద్భుతమైన గ్రేస్ తో చిరంజీవి చేసిన చిన్న డాన్స్ బిట్ ఫ్యాన్స్ ను ఊర్రూతలూగించింది. ప్రస్తుతం ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా అభిమానులు మాత్రం మా హీరో గ్రేట్ అంటూ.. నెట్టింట సందడి చేస్తున్నారు. చిరు 70 వసంతాల వేడుకల కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

36

సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తోన్న అనిల్ రావిపూడి

ఇక ప్రస్తుతం చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ క్రేజీ కమర్షియల్ ఎంటర్‌టైనర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. అయితే ఎప్పటికప్పుడు అనిల్ మాత్రం ఈసినిమాకు సంబంధించి అప్‌డేట్స్ ను ఇస్తూనే ఉన్నారు. ఇక ఈ సినిమా టీమ్ నుంచి అనఫిషియల్ గా వచ్చిన సమాచారం ప్రకారం, చిరంజీవి బర్త్‌డే స్పెషల్‌గా డబుల్ ట్రీట్ ప్లాన్ చేశాడట అనిల్ రావిపూడి.

ఆగష్టు 22న చిరంజీవి 70వ బర్త్‌డే సందర్భంగా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారని సమాచారం. అలాగే అదే రోజున ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఈ డబుల్ ట్రీట్‌కి సంబంధించిన ప్రకటనను త్వరలోనే మూవీ టీమ్ స్పెషల్ పోస్టర్ ద్వారా రిలీజ్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ అప్ డేట్ కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు బాస్ మూవీ టైటిల్, రిలీజ్ డేట్ తెలుస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈసారి మెగా బర్త్ డే మరింత ప్రత్యేకం అవ్వాలని వారు కోరుకుంటున్నారు.

46

సూపర్ ఫాస్ట్ గా మెగా157 షూటింగ్

ఇక ఈసినిమా షూటింగ్ విషయానికి వస్తే చితీరకరణ శరవేగంగా కొనసాగుతోంది. ఇటీవల చిరంజీవి, నయనతారపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఎలాంటి బ్రేక్ లేకుండా షూటింగ్‌ను పూర్తిచేయాలనే ఉద్దేశంతో టీం వేగంగా పనిచేస్తోంది. అంతే కాదు ఈసినిమాకు సంబంధించిన మూడు షెడ్యుల్స్ షూటింగ్ అయిపోయింది. మూడో షెడ్యూల్ షూటింగ్ ను రీసెంట్ గా కేరళలో కంప్లీట్ చేసుకుని చిరంజీవి వచ్చారు. ఈ షూటింగ్ కు సబంధించి అనిల్ రావిపూడి రీసెంట్ గా ఓ అప్ డేట్ కూడా ఇచ్చాడు. “మన శంకరవరప్రసాద్ గారు” ముచ్చటగా మూడవ షెడ్యూల్ ని కేరళలో పూర్తిచేసుకుని వచ్చారు అని ట్వీట్ చేసి ఓ వీడియోను కూడా షేర్ చేశారు. మెగా అభిమానులకు ఉత్సాహం తెప్పించడానికి చిరంజీవి సినిమాకు సబంధిచిన ప్రతీ షూటింగ్ అప్ డేట్ ను ఆయన అందిస్తూ వస్తున్నారు.

56

చిరంజీవి కామెడీ టైమింగ్ స్పెషల్

ఈ సినిమాలో చిరంజీవి కామెడీ టైమింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా అనిల్ రావిపూడి స్క్రిప్ట్ డిజైన్ చేశారని సమాచారం. సంక్రాంతి విడుదల కోసం రెడీ అవుతున్న ఈ సినిమాలో అభిమానులకు వినోదంతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ మిక్స్ చేసి పవర్‌ఫుల్ ప్యాకేజీగా తీర్చిదిద్దుతున్నారు.ఇక ఈసినిమాకు సంగీతాన్ని భీమ్స్ సిసిరోహియో అందిస్తున్నారు. గతంలో ఆయన అందించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా పాటల తరహాలోనే, ఈ మూవీలోని పాటలు కూడా వినిపించేలా రూపొందిస్తున్నారని సమాచారం. ఇప్పటికే మూడు షెడ్యుల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

66

మెగా మూవీ టైటిల్ ఇదేనా?

ఈ సినిమా టైటిల్ విషయానికొస్తే, "మన శంకర్ వరప్రసాద్ గారు" అనే టైటిల్‌పై దృష్టి పెట్టినట్టు సమాచారం. చిరంజీవి అసలు పేరు శివ శంకర్ వరప్రసాద్ కావడంతో, ఈ టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. చిరు బర్త్‌డే నాటికి అధికారికంగా టైటిల్ ఖరారు కానుందని తెలుస్తోంది. మెగాస్టార్ పుట్టినరోజున సినిమా టైటిల్, రిలీజ్ డేట్ రెండూ వచ్చే అవకాశం ఉండటంతో.. ఈ డబుల్ ట్రీట్‌ ను ఎంజాయ్ చేయడానికి మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా సంక్రాంతికి మరింత జోష్ ఇవ్వనుందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories