'పుష్ప 2' OTT విడుదల తేదీ ఎప్పుడు? ఎక్కడ

First Published | Jan 4, 2025, 4:03 PM IST

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ బాక్సాఫీసు వద్ద రికార్డులు తిరగరాస్తోంది. సినిమా ఓటీటీ విడుదల తేదీ గురించి వార్తలు వస్తున్నాయి. జనవరి చివరి నాటికి నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా స్ట్రీమింగ్ కావచ్చు.

Allu Arjun, Pushpa 2, OTT


అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా నటించిన ‘పుష్ప2: ది రూల్‌’ ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద రికార్డులు తిరగరాస్తున్న సంగతి తెలిసిందే. భారతీయ సినీ చరిత్రలో ఏ కమర్షియల్‌ మూవీ సాధించనన్ని వసూళ్లు రాబడుతూ దూసుకుపోతోంది.

ఈ క్రమంలో ‘పుష్ప 2’ ఓటీటీకి (Pushpa 2 OTT) రానున్నదంటూ సోషల్ మీడియాలో వేదికగా వార్తలు ట్రెండ్‌ అవుతున్నాయి. ఆ మధ్యన  జనవరి రెండో వారం నుంచి స్ట్రీమింగ్‌ కానుందంటూ పోస్టులు కనిపించాయి. అయితే అప్పుడు నిర్మాణ సంస్ద ఖండిస్తూ  వెండితెరపైనే ‘పుష్ప 2’ను చూసి హాలీడే సీజన్‌ను ఎంజాయ్‌ చేయమని చెప్పింది. అయితే ఇప్పుడు ఓటిటి డేట్ ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. 
 

pushpa 2


పుష్ప 2: ది రూల్ మనదేశంలో ఆల్ టైమ్ నంబర్ వన్ హిందీ చిత్రంగా చరిత్ర సృష్టించింది. బాక్సాఫీస్ దగ్గర ప్రపంచవ్యాప్తంగా ₹1800 కోట్ల మార్కును అధిగమించి అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. అలాగే ఈ చిత్రం తెలుగు రెండు రాష్ట్రాల్లో థియేట్రికల్ రన్‌ను ముగించటానకి సిద్దంగా ఉంది.

అయితే  పుష్ప 2 హిందీ మార్కెట్‌లో ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తూనే ఉంది. ఇదే క్రమంలో , OTT ప్లాట్‌ఫారమ్‌లు ఈ సినిమా స్ట్రీమింగ్ అరంగేట్రం కోసం సిద్ధమవుతున్నాయి.


Allu Arjun, Pushpa 2, BookMyShow


అందుతున్న సమాచారం మేరకు నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రం OTT హక్కులను రికార్డు స్థాయిలో ₹250 కోట్లకు కొనుగోలు చేసింది. ఓటిటి సంస్దలు తాము పెట్టిన పెట్టుబడిని తిరిగి పొందడానికి, ప్లాట్‌ఫారమ్ ఈ చిత్రాన్ని త్వరలో స్ట్రీమింగ్  చేయాలని భావిస్తున్నారు,

బాలీవుడ్ రిపోర్ట్ లు ప్రకారం ఈ నెలాఖరులో ప్రీమియర్‌ అని అంటున్నాయి. ఇక థియేట్రికల్ విడుదలైన 56 రోజుల వరకు పుష్ప 2 నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం చేయదని ప్రొడక్షన్ హౌస్ గతంలో ప్రకటించింది. జనవరి చివరి నాటికి, ఈ రూల్  గడువు ముగుస్తుంది, దాని OTT విడుదలకు ఫర్మిషన్ వచ్చేసినట్లే. 
  

 జనవరి 31వ తారీకున నెట్‌ ఫ్లిక్స్ ద్వారా పుష్ప 2 సినిమా మాస్‌ జాతర షురూ కాబోతుందంటోంది మీడియా. రాబోయే రెండు వారాల్లో నమోదు కాబోతున్న వసూళ్లను బట్టి  రిలీజ్ వాయిదా వేసే అవకాసం ఉందని అంటున్నారు. ఏడు వారాల తర్వాత స్ట్రీమింగ్‌ చేసినా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతానికి జనవరి 31వ తారీకుపై మేకర్స్ దృష్టి పెట్టారు. వారం పది రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్‌ విషయమై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.  

 ఇప్పటికే  పుష్ప 2 ఐదు భాషల్లో విడుదలైంది. ఈ చిత్రాన్ని జపాన్ మరియు చైనాలో విడుదల చేయడం ద్వారా దాని పరిధిని విస్తరించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.వివాదాలు ఎన్ని వచ్చినా కలెక్షన్స్ పై ఇంపాక్ట్ చూపించటం లేదు.

భాక్సాఫీస్ దగ్గర పుష్ప రాజ్ చేస్తున్న హంగామా మామూలుగా లేదు. ముఖ్యంగా నార్త్‌ ఇండియాలో ఊహించని స్థాయిలో వసూళ్లు వస్తున్నాయి. ఒక సౌత్‌ సినిమాకి, తెలుగు సినిమాకు హిందీ ప్రేక్షకులు ఇంతటి రెస్పాన్స్‌ ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందంటూ బాలీవుడ్‌ బాక్సాఫీస్ విశ్లేషకులు సైతం అవాక్కవుతున్నారు. బాలీవుడ్ ప్రముఖులు మెచ్చుకుంటూ పోస్ట్ లు పెడుతున్నారు.  
 

Latest Videos

click me!