‘పుష్ప-2’ హిందీ ఫస్ట్ డే కలెక్షన్స్ అంచనా.. ఎన్ని కోట్లో తెలిస్తే మైండ్ బ్లాకే

First Published Apr 15, 2024, 6:31 AM IST

 నార్త్ బెల్ట్ లో ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసే అవకాసం ఉందనే విషయమై డిస్కషన్స్ మొదలయ్యాయి. అక్కడి  ట్రేడ్ లెక్కలు,అంచనాలు వేస్తోంది. 


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప ది రైజ్’ మూవీ తెలుగులోనే కాకుండా నార్త్ లో కూడా దుమ్ము దులిపింది. బన్ని  కెరీర్ లోనే భారీ బ్లాక్‍బాస్టర్‌గా నిలిచింది. 2021లో రిలీజైన ఈ మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నారు.. అంతే కాదు  జాతీయ అవార్డ్స్ లో అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా అవార్డు గెలుచుకొని చరిత్ర సృష్టించారు. జాతీయ అవార్డు రావడంతో పుష్ప మూవీ క్రేజ్ పాన్ ఇండియా రేంజ్‍లో మారు మ్రోగిపోయింది.. 


ఈ క్రమంలో  ఇప్పుడు అంతా ‘పుష్ప ది రూల్’ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ  ఏడాది (2024) ఆగస్టు 15వ తేదీన పుష్ప 2 మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి కలెక్షన్స్ ఎంత రావచ్చు..మొదట రోజు ఓపినింగ్స్ ఎలా వస్తాయనే అంచనాలు అప్పుడే మొదలైపోయాయి. మరీ ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసే అవకాసం ఉందనే విషయమై డిస్కషన్స్ మొదలయ్యాయి. అక్కడి  ట్రేడ్ లెక్కలు,అంచనాలు వేస్తోంది. 
 


సినిమా  మీద ఉన్న  హై ఎక్సపెక్టేషన్స్ నేపథ్యంలో మొదటి రోజు  హిందీ బెల్ట్ లో పుష్ప ది రూల్ సినిమాకి భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం ఇది ప్రత్యేకంగా ఎవరూ చెప్పక్కర్లేదు.  దాంతో గతంలో సౌత్ నుంచి వచ్చి నార్త్ లో  కలెక్షన్స్ దుమ్ము రేపిన సినిమాలను గుర్తు చేసుకుంటున్నారు. సౌత్ సినిమాలు హిందీ బెల్ట్ లో మొదటి రోజు హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాలు అంటే టాప్ వన్ లో కేజీఎఫ్ చాప్టర్ 2 ఉంది. ఈ మూవీ ఏకంగా 52.39 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది . 
 

టాప్ 2 లో బాహుబలి 2 నిలిచింది. ఈ సినిమా 40.73 కోట్లు వసూళ్లు చేసింది. ప్రభాస్ సాహో మూవీ 25.82 కోట్లు మొదటి రోజు రాబట్టింది. రోబో 2.ఓ మూవీ 19.74 కోట్లు కలెక్ట్ చేసింది. కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా రికార్డ్ ని బ్రేక్ చేసే అవకాశం ఇప్పుడు పుష్ప ది రూల్ సినిమాకి వచ్చింది. ఐకాన్ స్టార్ ఫ్యాన్ బేస్, పుష్ప ది రూల్ సినిమాపై ఉన్న హైప్ తో కచ్చితంగా నార్త్ ఇండియాలో 60 కోట్లకి పైగా మొదటి రోజు ఈ చిత్రానికి వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
 


 పుష్ప ది రూల్ రిలీజ్ అయ్యే టైమ్ లో (ఆగష్టు 15న) అజయ్ దేవగన్ సింగం ఎగైన్ మూవీ ఉంటుందని టాక్ వచ్చింది. అయితే ఈ మూవీ రిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీంతో పుష్ప ది రూల్ కి ఆ రోజు పోటీగా ఎలాంటి హిందీ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు కన్ఫర్మ్ కాలేదు. దీంతో చిత్ర యూనిట్ కూడా నార్త్ ఇండియాలో పుష్ప ది రూల్ కి భారీ ఓపెనింగ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు.


  
 గతంలో నార్త్ లో రికార్డులు తిరగరాసింది పుష్ప చిత్రం. అల్లు అర్జున్ మేనరిజమ్స్ అక్కడి ఆడియన్స్ ని ఫిదా చేసేశాయి. నార్త్ లో పుష్ప రూ.108 కోట్ల వసూళ్లను రాబట్టింది. దాంతో ‘పుష్ప’ కి సీక్వెల్ గా ‘పుష్ప 2 ‘ (Pushpa2) కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ముంబై డిస్ట్రిబ్యూటర్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ 300 కోట్లకు అమ్ముడైంది. ఇదొక ఫ్యాన్సీ డీల్ అని చెప్పాలి.  అయితే ఇంత పెద్ద మొత్తం రికవరీ అవ్వాలంటే మినిమం మూడు  వారాలు అయినా హౌస్ ఫుల్స్ తో నార్త్ లో  ఆడాలని అంటున్నారు.  


మొదటి పార్టులో పుష్ప ఎలా ఎదిగాడు అని చూపించిన సుకుమార్.. రెండో పార్టులో ఎలా తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు అని చూపించబోతున్నారని సమాచారం.  ఈ సీక్వెల్ లో జపాన్ ఎపిసోడ్, జాతరలో బన్నీ చీర కట్టు ఫైట్ ఓ రేంజ్​లో ఉండనుందని టాక్ వినిపిస్తోంది. ఫహద్ ఫాజిల్ - అల్లు అర్జున్ మధ్య ఫైట్స్​ను మూడో భాగంలోనే ఎక్కువగా చూసే అవకాశం ఉండొచ్చని అంటున్నారు. ఇప్పటి వరకు పరిచయం కాని చాలా కొత్త పాత్రలు కూడా ఎంట్రీ ఇస్తాయని చెబుతున్నారు. దీని బట్టి పుష్పను టాలీవుడ్​లో ఒక పవర్ ఫుల్ బ్రాండ్​గా మార్చేందుకు సుక్కు సినిమాను గట్టిగానే చెక్కుతున్నారని అర్థమవుతోంది.


‘పుష్ప: ది రూల్‌’ సినిమా విషయానికి వస్తే భారీ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాని మాత్రం భారత్‌లో విడుదల చేసిన రోజునే, ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ప్రకటించింది. రష్యాతోపాటు... 20కి పైగా  దేశాల్లో సినిమాని ఒకేసారి విడుదల చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్టు సమాచారం.   ఇప్పటికే ‘పుష్ప2’ సినిమాపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.
 


 ఆ మధ్యన  ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఫహాద్ ఫాజిల్‌ ఆ అంచనాలను పెంచేశారు. రెండో భాగంలో భన్వర్‌ సింగ్‌ పాత్ర ఎక్కువగా ఉంటుందని చెప్పారు. హీరోకు ఆ పాత్రకు మధ్య చాలా యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయన్నారు. ఇక ఈ సీక్వెల్‌లో భన్వ‌ర్‌ సింగ్ షెకావ‌త్‌ పాత్రకు సంబంధించిన షూటింగ్‌ పూర్తయినట్లు సమాచారం. 

click me!