అల్లు అర్జున్ పుష్ప2 కోసం భారీ ప్లాన్ చేస్తోన్న సుకుమార్, 20 దేశాల్లో ఏర్పాట్లు

First Published Dec 6, 2022, 12:45 PM IST

అల్లు అర్జున్ పుష్ప 2 విషయంలో తగ్గేది లే అంటున్నాడు జీనియస్ డైరెక్టర్ సుకుమార్. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కు పాన్ ఇండియా హోదా ఇచ్చిన దర్శకుడు.. పుష్ప2 తో పాన్ వరల్డ్ క్రేజ్ నుసాధించాలని ప్లాన్ చేస్తున్నాడు. 
 

పుష్ప సినిమా క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్నీ ఇన్నీ కావు. బన్నీని ఓరేంజ లో నిలబెట్టిన సినిమా ఇది. తెలుగు, మలయాళంలో పిచ్చి క్రేజ్ ఉన్న స్టార్ హీరోను.. ఈ ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో అదే క్రేజ్ వచ్చిపడింది. దాంతో అల్లు అర్జున్ అంటే ఇప్పుడు తెలియనివారంటూ లేదు. 
 

అందులోనూ పుష్ప సినిమా ప్రభావం ఎంతలా పడిందంటే.. కొన్ని వేల పాజిటీవ్ మీమ్స్.. పుష్ఫను ఇమిటేట్ చేస్తూ.. దేశ వ్యాప్తంగా.. ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో వీడియోలు హల్ చల్ చేశాయి. దాంతో ఈమూవీ ఇమేజ్ ప్రపంచ వ్యాప్తం అయ్యింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి ఈ నెలతో ఏడాది పూర్తి అయ్యింది. అయినా సరే ఇంకా ఈసినిమా క్రేజ్ తగ్గలేదు. 
 

Pushpa movie

రీసెంట్ గా ఈసినిమాన రష్యాలో రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు టీమ్. అంతే కాదు రష్యాలో పుష్ప మ్యానియా నడుస్తుంది ప్రస్తుతం. ఇక ఈరేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమాకు సీక్వెల్ అంటే ఎలా ఉండాలి చెప్పండి. ఇక అదే  ప్లాన్ చేసే పనిలో ఉన్నాడు మన లెక్కల మాస్టారు. 
 

ఇక పుష్ప2 ను అంతకు మించి చూపించాలని తపన పడుతున్నాడుసుకుమార్. పుష్ప ఆరేంజ్ లో ఉంటే. పుష్ఫ2 నిరాశపరచకూడదు. అందుకే  వరల్డ్ క్లాస్ క్వాలిటీతో ఈమూవీని తెరకెక్కించడమే కాకుండా..  ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి సినిమాను రిలీజ్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారట. దానికి తగ్గ వ్యూహాలు కూడా రెడీ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. దాదాపు  20కి పైగా దేశాల్లో సినిమాను ఒకేసారి విడుదల చేయాలనే లక్ష్యంతో ప్లాన్స్‌ వేస్తోందట మైత్రీ టీమ్‌ అండ్‌ సుకుమార్‌ టీమ్‌. 

పుష్ప: ది రైజ్‌ సినిమాకు వచ్చిన స్పందనను, బజ్‌ను, క్రేజ్‌ను కొనసాగిస్తూ.. పుష్ప: ది రూల్‌ రేంజ్  ని ఇంకా పెంచే పనిలో ఉన్నారట టీమ్. దీని కోసం పక్కా ప్లాన్ చేయడం కోసం ఇంత గ్యాప్ తీసుకున్నట్టు తెలుస్తోంది. చాలా కాలం తరువాత రీసెంట్ గా పుష్ప 2 షూటింగ్ స్టార్ట్ అయ్యింది. 

ప్రస్తుతం రష్యాలో పుష్ప రిలీజ్ హడావిడిలో ఉన్నారు బన్నీ టీమ్. పుష్ప: ది రైజ్‌ డిసెంబరు 8న రష్యాలో విడుదల కానుంది.అక్కడి నుంచి వచ్చిన తరువాత రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. 

అంతర్జాతీయ ప్రమాణాలతో సినిమాను తెరకెక్కించడంతోపాటు, ఒకేసారి వివిధ భాషల్లో విడుదల చేయాలని అనుకుంటున్నారట. దాంతోపాటు తొలి పార్టు విషయంలో ఆఖరులో కంగారు పడిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుంటున్నారట. అలాంటి ఇబ్బందులు లేకుండా ప్లానింగ్‌ వేసి, రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేస్తారట. దీని కోసం పక్కా ప్లాన్స్‌ రెడీ చేసుకునే బరిలోకి దిగారట.
 

click me!