అయితే పవన్, సుజీత్, దానయ్య మూవీ వెనుక ప్రభాస్ కేంద్రంగా చాలా పెద్ద తతంగమే నడిచింది అట. ఆ కథ ఏంటో తెలుసుకోవాలంటే ప్రభాస్ రాధే శ్యామ్ మూవీ నుంచి మొదలు పెట్టాలి. రాధే శ్యామ్ చిత్రానికి బడ్జెట్, రిలీజ్ సమస్యలు తలెత్తినప్పుడు దానయ్య సాయం చేశారట. భారీగా ఆర్థిక సాయం చేసి ఆ చిత్రం రిలీజ్ అయ్యేలా చేశారట. దీనికి ప్రతిఫలంగా ఒక చిత్రం చేస్తానని ప్రభాస్ దానయ్యకి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.