అప్పుడు చికిత, మల్లిక మీద పంచులు లో వేస్తూ మాట్లాడుతుంది. అప్పుడు మల్లికమ్మ జానకమ్మ గారు వచ్చారు మీరు కుళ్ళుకోవడం ఆపండి అని అంటుంది చికిత. అప్పుడు జానకి,రామచంద్ర వాళ్ళు సంతోషంగా లోపలికి రావడం చూసి మల్లిక కుళ్ళుకుంటూ ఉంటుంది. అప్పుడు రామచంద్ర రావడంతో జ్ఞానాంబ ప్రయాణం ఎలా జరిగింది భాను బాగుందా అని అడగగా బాగుంది అందర్నీ అడిగాను అని చెప్పమంది అమ్మ అని అనడంతో వెంటనే జ్ఞానాంబ ఏం జానకి మా స్నేహితుడు ఎలా ఉంది అని అనగా రామచంద్ర బానమ్మకి జానకి నచ్చేసింది అని అనడంతో అది మల్లిక కుళ్ళుకుంటూ ఉంటుంది. జ్ఞానాంబ కూడా నా పెద్ద కోడలు అందరికీ ఇట్టే నచ్చుతుంది అని సంతోషంగా మాట్లాడుతూ ఉండగా మల్లిక బాధపడుతూ ఉంటుంది.