`పుష్ప2`కి బన్నీ పారితోషికం తీసుకోవడం లేదు.. డైరెక్ట్ గా ప్రభాస్‌తో పోటీ!

Published : Aug 28, 2023, 07:06 PM IST

జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డుకి ఎంపికైన అల్లు అర్జున్‌ పారితోషికం చర్చనీయాంశం అవుతుంది. `పుష్ప2` చిత్రానికి ఆయన పొందే పారితోషికం మైండ్‌ బ్లాంక్‌ చేస్తుంది.   

PREV
16
`పుష్ప2`కి బన్నీ పారితోషికం తీసుకోవడం లేదు..  డైరెక్ట్ గా  ప్రభాస్‌తో పోటీ!

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌.. ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డుకి ఎంపికయ్యారు. తెలుగులో నటుడిగా తొలి నేషనల్‌ అవార్డు తీసుకొచ్చాడు. ఇప్పుడు చర్చనీయాంశంగా మారారు. `పుష్ప` చిత్రానికిగానూ బన్నీకి బెస్ట్ యాక్టర్‌గా నేషనల్‌ అవార్డు వచ్చింది. సుకుమార్‌ దర్శకత్వం వహించిన `పుష్ప` చిత్రం రెండేళ్ల క్రితం వచ్చి సంచలన విజయం సాధించింది. రిలీజ్‌ రోజు మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం ఆ తర్వాత బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. నార్త్ లోదుమ్మరేపింది. సుమారు రూ.350కోట్లు వసూలు చేసింది. 

26

ప్రస్తుతం ఈసినిమాకి రెండో పార్ట్ లో నటిస్తున్నారు బన్నీ. `పుష్ప2ః ది రూల్‌` పేరుతో ఈ చిత్రం రూపొందుతుంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. పుష్పరాజ్‌.. మొదటి భాగంలో రైజ్‌ అయ్యాడు. ఇప్పుడు రెండో భాగంలో రూల్‌ చేయబోతున్నారు. అయితే మొదటి సినిమా పెద్ద విజయం సాధించడంతో రెండో భాగం బడ్జెట్‌ పెంచారు. భారీ స్థాయిలో లావిష్‌గా తెరకెక్కిస్తున్నారు. కంటెంట్‌ పరంగానూ సైజ్‌ పెంచారట దర్శకుడు సుకుమార్‌. దీంతో `పుష్ప2`పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 
 

36

దీనికితోడు ఇప్పుడు నేషనల్‌ అవార్డు రావడంతో సినిమాపై క్రేజ్‌ మరింత పెరిగింది. నేషనల్‌ వైడ్‌గా ఇప్పటికే రావాల్సిన పబ్లిసిటీ వచ్చింది. `పుష్ప2`పై హైప్‌ బాగుంది. అయితే ఈ సినిమాకి బన్నీ పారితోషికం పెంచాల్సింది. `పుష్ప` మొదటి భాగానికి నాలభై కోట్ల లోపే అందుకున్నారట బన్నీ. కానీ రెండో భాగానికి దాన్ని డబుల్‌ చేస్తారని భావించారు. కానీ ఈ చిత్రానికి అల్లు అర్జున్‌ పారితోషికం తీసుకోవడం లేదట. అదే ఇప్పుడు ఆశ్చర్యపరుస్తున్న అంశం. 

46

కానీ `పుష్ప2`కి భారీకి ముట్టేది ప్రభాస్‌ పారితోషికానికి దగ్గరగా ఉంటుందని తెలుస్తుంది. ప్రభాస్‌ ఇప్పుడు ఒక్కో సినిమాకి దాదాపు రూ. 150కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారని సమాచారం. బన్నీకి `పుష్ప2`కి కూడా ఆ ఫిగర్‌కి దగ్గరగా ఉందట. అయితే పారితోషికం తీసుకోనిది ఆయనకు ఎలా వస్తుందంటే.. ఏరియా హక్కులు తీసుకుంటున్నారని బన్నీ. నార్త్ బెల్ట్ థియేట్రికల్‌ రైట్స్ ని బన్నీ తీసుకుంటున్నారని సమాచారం.
 

56
prabhas-allu arjun

అంటే హిందీలో వచ్చే కలెక్షన్లు అల్లు అర్జున్‌ తీసుకుంటున్నారట. అయితే అక్కడ రూ.125 నుంచి 150 వరకు కోట్‌ అవుతున్నట్టు తెలుస్తుంది. ఆ స్థాయి థియేట్రికల్‌ హక్కులను బన్నీకి పారితోషికంగా ఇచ్చేస్తారు నిర్మాతలు. 

66

నార్త్ లో `పుష్ప2` కలెక్ట్ చేసేదాన్ని బట్టి బన్నీకి పారితోషికం వస్తుందని చెప్పొచ్చు. అక్కడ ఇది రెండు వందల కోట్లు వసూలు చేస్తే సుమారు 110కోట్లు, మూడు వందల కోట్లు చేస్తే, 150కోట్లు బన్నీకి పారితోషికంగా వస్తాయి. సినిమా సక్సెస్‌ని బట్టి అల్లు అర్జున్‌ రెమ్యూనరేషన్‌ ఉంటుంది. ఇక సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా కొనసాగుతుంది. ఫహద్‌ ఫాజిల్‌ విలన్‌గా చేస్తున్నారు. అనసూయ, సునీల్‌, రావు రమేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో మరో నటి అప్పీయరెన్స్ ఉండబోతుందట. ఐటెమ్‌ సాంగ్‌ కూడా ఉంటుందని టాక్‌. ఇక ఈచిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 22న విడుదల చేయబోతున్నట్టు సమాచారం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories