telugu heroes
Relugu Reroes: ఇప్పుడు ఇండియన్ సినిమా లెక్కలు మారిపోయాయి. పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ ఊపందుకోవడంతో, పాన్ ఇండియా హీరోలు కూడా వచ్చారు. ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా ఇండియా వైడ్‌గా పోటీ నెలకొంటుంది. తెలుగు హీరోలు గొప్ప అంటే తమిళ హీరోలు గొప్ప, హిందీ హీరోలు గొప్ప అనే పరిస్థితి వచ్చింది.
అందులో భాగంగానే ఇండియాలోనే పాపులర్ యాక్టర్స్ కి సంబంధించిన పోటీ నెలకొంటుంది. ఇందులో ఎవరికి ఎక్కువ క్రేజ్ ఉంది, ఎవరికి తక్కువ ఉంది అనేది చర్చనీయాంశం అవుతుంది. దీనికి సంబంధించి ప్రముఖ మీడియా సంస్థ ఓర్మాక్స్ మీడియా దీనికి సంబంధించిన లిస్ట్ ప్రకటిస్తూనే ఉంటుంది. మార్చి నెలకు సంబంధించిన లిస్ట్ ని విడుదల చేసింది.
ఓర్మాక్స్ మీడియా మార్చి నెలకు సంబంధించి ఇండియా మోస్ట్ పాపులర్ టాప్ 10 హీరోల జాబితా ప్రకటించింది. ఇందులో అల్లు అర్జున్ టాప్‌లోకి రాలేకపోయారు. ఆయన మూడో స్థానంలో నిలిచారు. `పుష్ప 2`తో ఇండియన్ సినిమాని షేక్ చేసిన ఆయన ఇండియా టాప్ 10 జాబితాలో మాత్రం ఫస్ట్ ప్లేస్ సొంతం చేసుకోలేకపోయారు.
ఆ స్థానంలో మరోసారి ప్రభాస్ నిలిచారు. గత రెండు మూడు నెలలుగా ఆయన టాప్ 1 లోనే ఉంటున్నారు. మార్చి నెలలో కూడా అదే కంటిన్యూ అయ్యింది. ఇటీవల కాలంలో ప్రభాస్ సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేకపోయినా ఆయనే ఫస్ట్ ప్లేస్‌లో ఉండటం ఆశ్చర్యపరుస్తుంది.
TVK chief and actor Vijay. (File PhotoANI)
రెండో స్థానంలో కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ నిలిచారు. ఆయన ఇటీవల పార్టీ పరంగా వార్తల్లో నిలిచారు. వరుసగా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. అదే సమయంలో ఆయన నటిస్తున్న `జన నాయగన్` మూవీ అప్ డేట్లు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో విజయ్ రెండో స్థానం దక్కించుకున్నారు. ఇక సోషల్ మీడియాలో విజయ్ ఫ్యాన్స్ చేసే హడావుడిగా కూడా వేరే లెవల్‌లో ఉంటుందని తెలిసిందే.
మూడో స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలిచారు. `పుష్ప 2`తో రచ్చ చేసిన ఆయన ఆ తర్వాత వివాదాలతో వార్తల్లో నిలిచారు. ఇప్పుడు అన్ని రకాలుగా సైలెంట్ అయ్యారు. అయితే ఇటీవల అట్లీతో సినిమా ప్రకటించి మరోసారి వార్తల్లో నటించారు.
ఈ ప్రాజెక్ట్ గురించి బాగా డిస్కషన్ జరిగింది. ఇది ఏప్రిల్ నెలలో ప్రభావం చూపించే అవకాశం ఉంది. కానీ మార్చిలో మాత్రం ఆయన మూడో స్థానానికే పరిమితమయ్యారు. ఇక నాల్గో స్థానంలో బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ ఉన్నారు.
ఐదో స్థానంలో తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు నిలవడం విశేషం. గత నెలలో ఆయన డౌన్‌లో ఉండగా ఇప్పుడు టాప్‌లోకి వచ్చారు. ఏకంగా ఎన్టీఆర్, రామ్ చరణ్‌లను దాటేసి ముందుకు రావడం విశేషం. రాజమౌళితో సినిమా నేపథ్యంలో ఆయన టాప్ 5లోకి వచ్చారని చెప్పొచ్చు. ఇక మున్ముందు మహేష్ క్రేజ్ మరింతగా పెరిగిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
`గుడ్ బ్యాడ్ అగ్లీ` చిత్రంతో అలరిస్తున్న అజిత్ టాప్ 6లో నిలిచారు. గత నెల నుంచి అజిత్ రచ్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన టాప్‌లోకి వచ్చారు. ఇక ఏడో స్థానంలో ఎన్టీఆర్ ఉండగా, ఎనిమిదో స్థానంలో రామ్ చరణ్ నిలిచారు.
తొమ్మిదో స్థానంలో సల్మాన్ ఖాన్, పదో స్థానంలో అక్షయ్ కుమార్ నిలిచారు. ఇలా టాప్ 10లో ఐదుగురు టాలీవుడ్ హీరోలు, ఇద్దరు కోలీవుడ్ హీరోలు, ముగ్గురు హిందీ హీరోలుండటం విశేషం. ఇందులో తెలుగు వారి హవానే ఎక్కువగా ఉంది.