ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో తగ్గేదే లే అంటూ సరికొత్తట్రెండ్ సెట్ చేశారు. తగ్గేదే లే డైలాగ్ తో పాటు బన్నీ గడ్డం నిమురుకునే యాటిట్యూడ్ కూడా దేశం మొత్తాన్ని ఊపేసింది. పుష్ప ఫీవర్ తగ్గక ముందే అల్లు అర్జున్ మరో కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు. సాధారణంగా హీరోలు స్టైలిష్ గా అనిపించే టీ షర్ట్ లు ధరిస్తుంటారు. అవసరం అయితే ఆ టీషర్ట్స్ పై మంచి కొటేషన్స్ ఉండేలా చూసుకుంటారు.