రహస్యంగా పవన్‌ కళ్యాణ్‌ని కలిసిన అల్లు అర్జున్‌.. మార్క్ శంకర్‌ మామా అల్లుళ్లని కలిపారా? నిజం ఏంటంటే?

Allu Arjun Meet Pawan Kalyan: టాలీవుడ్‌లో ఒక సంచలన విషయం చక్కర్లు కొడుతుంది. పవన్‌ కళ్యాణ్‌, అల్లు అర్జున్‌ కలిసినట్టు తెలుస్తుంది. సీక్రెట్‌గా పవన్‌ కళ్యాణ్‌ కుటుంబాన్ని అల్లు అర్జున్‌, అల్లు స్నేహా పరామర్శించినట్టు వార్తలు వస్తున్నాయి. గత కొంత కాలంగా పవన్‌, అల్లు అర్జున్‌ మధ్య వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ వార్త సంచలనంగా మారింది. 
 

allu arjun meet pawan kalyan secret Mark Shankar who brought together his uncle sons in law in telugu arj
Allu Arjun Meet Pawan Kalyan

Allu Arjun Meet Pawan Kalyan: పవన్‌ కొడుకు మార్క్ శంకర్‌ సింగపూర్‌లో అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. క్రమంగా కోలుకుని హైదరాబాద్‌కి వచ్చారు. తిరుపతి వెళ్లి శ్రీవారి మొక్కులు తీర్చుకున్నారు. పవన్‌ భార్య అన్నా కొణిదెల శ్రీవారికి తలనీలాలు కూడా సమర్పించింది. ఒక్క పూట భోజనానికి విరాళం కూడా అందించారు. 

allu arjun meet pawan kalyan secret Mark Shankar who brought together his uncle sons in law in telugu arj

తాజాగా పవన్‌ కళ్యాణ్‌ ఫ్యామిలీని అల్లు అర్జున్‌ కలిశారట. హైదరాబాద్‌లోని నివాసంలో సోమవారం రాత్రి అల్లు అర్జున్‌, ఆయన భార్య స్నేహారెడ్డి వెళ్లి పరామర్శించారట. పవన్‌ కొడుకు మార్క్ శంకర్‌ ఆరోగ్యం గురించి ఆరా తీశారట. దీంతో ఇప్పుడు పవన్‌, అల్లు అర్జున్‌ మధ్య వివాదాలు సమసిపోయినట్టే అనే మాట వినిపిస్తుంది. అయితే ఇదంతా మీడియాకి తెలియకుండా రహస్యంగా జరగడం ఆశ్చర్యపరుస్తుంది. 
 


సాధారణంగా పవన్‌ కళ్యాణ్‌, అల్లు అర్జున్‌ కలవడమనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలన విషయం. ఏడాది కాలంగా వీరి మధ్య గొడవలు, మనస్పర్థాలు ఉన్న నేపథ్యంలో వీరు కలవడం చర్చనీయాంశమైన విషయం. కానీ బయటకు తెలియకుండా ఉండేందుకు రహస్యంగా కలిసినట్టు తెలుస్తుంది. ఏదో పబ్లిసిటీ స్టంట్‌ లాగా కాకుండా దీన్ని రెండు కుటుంబాల రిలేషన్‌కే ప్రయారిటీ ఇచ్చే ఉద్దేశ్యంతో ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని బన్నీ పీఆర్‌ టీమ్‌ నిర్థారించింది.  

Pawan Kalyan’s son Mark Shankar

మామ పవన్‌ కళ్యాణ్‌, అల్లు అర్జున్‌ మధ్య వివాదాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మామా అల్లుళ్లని మార్క్ శంకర్‌ కలిపాడనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇది అటు పవన్‌ కళ్యాణ్‌ అభిమానులను, ఇటు అల్లు అర్జున్‌ అభిమానులను ఖుషీ చేస్తుంది. వీరిద్దరు కలవడం ఇప్పుడు మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే అనే సందేశం కూడా బయటకు వెళ్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

read  more:సావిత్రి చివరి కోరిక.. తన సమాధిపై ఏం రాయాలని చెప్పిందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు

also read: సమంత లక్కీ హీరో ఎవరో తెలుసా? తెలుగు స్టార్‌ హీరోలు, డైరెక్టర్లకి పెద్ద షాక్‌

Latest Videos

vuukle one pixel image
click me!