అదే విధంగా తన సక్సెస్ కి ముఖ్య కారణాన్ని కూడా అల్లు అర్జున్ రివీల్ చేశారు. నేను నా చిత్రాన్ని సాధారణ ప్రేక్షకుడిలా చూస్తాను. అందువల్ల సినిమాలో, నాలో నెగిటివ్స్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. నా సక్సెస్ సీక్రెట్ అదే అని అల్లు అర్జున్ తెలిపారు. సినిమాల్లో ఎంత పెద్ద సక్సెస్ సాధించినా రియల్ లైఫ్ లో సింపుల్ గా ఉంటానని బన్నీ తెలిపారు.