Shankar: శంకర్‌కు షాక్, కాపీ కేసులో రూ.10 కోట్ల ఆస్తులు జప్తు!

Published : Feb 21, 2025, 05:09 AM IST

Shankar:  దర్శకుడు శంకర్‌కు చెందిన రూ.10 కోట్ల విలువైన స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. 'రోబో' సినిమా కథ కాపీ ఆరోపణల నేపథ్యంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ చర్య తీసుకున్నారు.

PREV
13
Shankar:  శంకర్‌కు షాక్, కాపీ కేసులో  రూ.10 కోట్ల ఆస్తులు జప్తు!
Shankar properties attached in plagiarism case in telugu

 
Shankar:  ప్రముఖ దర్శకుడు శంకర్‌ (Director Shankar)కు  చెందిన దాదాపు రూ.10 కోట్ల విలువైన మూడు స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం ప్రకారం ఈ నెల 17న ఆస్తులను అటాచ్‌ చేసినట్టు ఈడీ తాజాగా ప్రకటించింది.

ఈ విషయం విన్న శంకర్ అభిమానులు షాక్ కు గురి అయ్యారు. శంకర్ సినిమాలు వరసగా ఫెయిల్ అవటం, ఇప్పుడు ఇలా ఆస్దులు జప్తు జరగటం వారికి బాధ కలగచేస్తోంది. ఈ మేరకు ..ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన శంకర్ కు ఇలాంటి పరిస్దితి వచ్చిందేమిటి అంటున్నారు.  ఇంతకీ ఆస్తుల జప్తు కు కారణం ఏమిటో చూద్దాం. 

23
Shankar properties attached in plagiarism case in telugu

 
కొద్ది కాలం క్రితం  తన కథ ‘జిగుబా’ను కాపీ కొట్టి శంకర్‌ ‘రోబో’ సినిమా తెరకెక్కించారంటూ అరూర్‌ తమిళనాథన్‌ అనే వ్యక్తి 2011లో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. శంకర్‌ కాపీరైట్, ఐటీపీ చట్టాలను ఉల్లంఘించారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

మరోవైపు, ఈ కేసు విషయమై ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టీఐఐ) నివేదిక కూడా శంకర్‌కు వ్యతిరేకంగా వచ్చింది. జిగుబా కథకు, రోబో సినిమాకు మధ్య చాలా పోలికలున్నాయని తెలిపింది.  అలాగే న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈడి (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) విచారణ చేపట్టింది. రచన, దర్శకత్వం చేపట్టినందుకు గాను శంకర్ కు 11 కోట్ల 50 లక్షల పారితోషికం అందినట్టు గుర్తించారు. 

33
Shankar properties attached in plagiarism case in telugu


ఇన్వెస్టిగేషన్ లో బయట పడిన విషయాల ఆధారంగా 10 కోట్ల 11 లక్షలు విలువ కలిగిన శంకర్ మూడు స్థిరాస్తులను ఈడి తాజాగా అటాచ్ చేసింది. ప్రివెన్షన్ అఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) చట్టం కింద ఈ చర్యలు తీసుకుంది.

కాపీ రైట్ యాక్ట్ 1957ని ఉల్లంఘిస్తూ శంకర్ చౌర్యానికి పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్ టిట్యూట్ అఫ్ ఇండియా (FTII) చేపట్టిన మరో విచారణలో ఏంథిరన్, జిగూబా మధ్య సారూప్యతలు ఉన్నాయని నిర్ధారించింది. దీంతో శంకర్ కు సంబంధించిన 11 కోట్ల విలువైన ఆస్తులకు అటాచ్ మెంట్ వచ్చింది. తదుపరి చర్యలు ఇంకా వెల్లడించలేదు. 

Read more Photos on
click me!

Recommended Stories