Vishwaksen: విశ్వక్‌ సేన్ బహిరంగ క్షమాపణ వెనక అసలు కారణం అదే?

Published : Feb 21, 2025, 06:12 AM IST

Vishwaksen:  'లైలా' సినిమాపై వస్తున్న విమర్శలకు విశ్వక్ సేన్ క్షమాపణ లేఖ విడుదల చేశారు. తన తప్పులను అంగీకరిస్తూ, అభిమానులకు, మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై అసభ్యత లేని సినిమాలే చేస్తానని హామీ ఇచ్చారు.

PREV
14
Vishwaksen:  విశ్వక్‌ సేన్ బహిరంగ క్షమాపణ వెనక అసలు కారణం అదే?
Vishwaksen issues apology letter over vulgarity in Laila in telugu


Vishwaksen:  విశ్వక్‌ సేన్ లీడ్​ రోల్​లో నటించిన లేటెస్ట్ సినిమా 'లైలా'. ఈ సినిమాలో విశ్వక్ లేడీ గెటప్​లో కనిపించారు. తెలుగులో చాలా రోజుల త‌ర్వాత ఓ హీరో పూర్తిస్థాయి లేడీ గెట‌ప్‌లో కనిపించిన సినిమా ఇది. వాలెంటైన్స్​ డే సందర్భంగా రిలీజైన ఈ సినిమా  డిజాస్టర్ అయ్యింది.  

విశ్వక్సేన్ ని చాలా మంది ఇలాంటి అసభ్యకరమైన సినిమా చేసావేంటి అంటూ సోషల్ మీడియా వేదికల్లో తిట్టిపోసారు. ఈ క్రమంలో విశ్వక్‌ సేన్‌ అభిమానులకు ఓ లేఖ రాశాడు. తన సినిమాకు వచ్చిన నిర్మాణాత్మక విమర్శను పూర్తిగా అంగీకరిస్తున్నానని అందులో తెలిపాడు. తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ డిజాస్టర్‌గా నిలిచిపోయిన సినిమాపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
 

24
Vishwaksen issues apology letter over vulgarity in Laila in telugu


విశ్వక్‌ సేన్‌ లెటర్‌లో పేర్కొన్న అంశాలు ఇవే..

“నమస్తే, ఇటీవల నా సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి చేరుకోలేకపోయాయి. నా చివరి సినిమాకు వచ్చిన నిర్మాణాత్మక విమర్శను పూర్తిగా అంగీకరిస్తున్నాను. నన్ను నమ్మి, నా ప్రయాణాన్ని మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ – నా అభిమానులకు, నాపై ఆశీర్వాదంగా నిలిచినవారికి – హృదయపూర్వక క్షమాపణలు.

నా ప్రాధాన్యం ఎప్పుడూ కొత్తదనం తీసుకురావడమే, కానీ ఆ ప్రయత్నంలో మీ అభిప్రాయాలను నేను గౌరవిస్తున్నాను. ఇకపై, నా ప్రతి సినిమా క్లాస్ లేదా మాస్ అయినా సరే, అసభ్యత ఉండదు. నేను ఒక చెడు సినిమా తీస్తే, నన్ను విమర్శించే హక్కు పూర్తిగా మీకు ఉంది.

ఎందుకంటే, నా ప్రయాణంలో ఎవ్వరూ లేని సమయంలో నన్ను ప్రేమతో ముందుకు నడిపించింది మీరు. నా కెరీర్ ప్రారంభం నుంచి నేను ఎంచుకున్న కథలను మీరు ఎంతగా ప్రేమించారో తెలుసు. ఇక పై కేవలం సినిమా మాత్రమే కాదు,

34
Vishwaksen issues apology letter over vulgarity in Laila in telugu


నా ప్రతి సన్నివేశం కూడా మీ మనసుకు తగిలేలా ఉండాలని నిర్ణయించుకున్నాను.అంతే కాకుండా, నా మీద విశ్వాసం ఉంచిన ప్రొడ్యూసర్స్, డిస్టిబ్యూటర్స్ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే, నా కథానాయకులు – దర్శకులు, రచయితలు నా వెన్నెముకగా నిలిచి, నన్ను మలిచిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.

మీ అందరి నిర్మాణాత్మక విమర్శలకు ధన్యవాదాలు. త్వరలోనే మరొక బలమైన కథతో ముందుకు వస్తాను. నా మంచి, చెడు కాలాల్లో నన్ను నమ్మి నిలబెట్టుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మీ మద్దతు నాకు ఎంతో ప్రాముఖ్యం. మీ… విశ్వక్ సేన్” అని అన్నాడు.
 

44
Vishwaksen issues apology letter over vulgarity in Laila in telugu


ఇక విశ్వక్సేన్ గతంలో ఎప్పుడూ క్షమాపణ చెప్పటానికి కూడా ఇష్టపడలేదు. అలాంటిది హఠాత్తుగా ఇలా బహిరంగ లేఖ రాయటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.

అయితే లైలా ఎఫెక్ట్ ఆయన నెక్ట్స్ సినిమా బిజినెస్ పై ఖచ్చితంగా పడుతుందని, ఈ లోగా అభిమానులను, మీడియాని మంచి చేసుకోమని, దూరం పెంచుకోవద్దని , ప్రస్తుత ప్రాజెక్టుకు చెందిన సితార ఎంటర్టైన్మెంట్స్ ...విశ్వక్సేన్ కు సలహా ఇచ్చి క్షమాపణ లు చెప్పించారని ఫిల్మ్ సర్కిల్స్ లో  చెప్పుకుంటున్నారు. అయితే ఇందులో ఎంత వరకూ నిజముంది అనేది తెలియాలి. 

 

Read more Photos on
click me!

Recommended Stories