RRR తరహా ప్రయోగం... పుష్ప 2లో చరణ్ వలె చూపించాలని పట్టుబడుతున్న అల్లు అర్జున్!

Published : Apr 06, 2022, 09:49 PM IST

టాలీవుడ్ స్టార్స్ ఒక్కొక్కరిగా పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకుంటున్నారు. దీని కోసం వారు ఎంత కష్టానికైనా వెనుకాడడం లేదు. ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ నార్త్ ఆడియన్స్ ని ఫిదా చేస్తున్నారు. ప్రభాస్ తర్వాత పుష్ప తో అల్లు అర్జున్, ఆర్ ఆర్ ఆర్ తో ఎన్టీఆర్(Ntr), చరణ్ దేశవ్యాప్తంగా పాప్యులర్ అయ్యారు. 

PREV
16
RRR తరహా ప్రయోగం... పుష్ప 2లో  చరణ్ వలె చూపించాలని పట్టుబడుతున్న అల్లు అర్జున్!
Rrr -Pushpa 2

మరి ఎంత గుర్తింపు వచ్చినా దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తమ తోటి హీరోలతో పోటీపడుతున్నారు. ఈ విషయంలో అల్లు అర్జున్ ఓ అడుగు ముందు ఉంటారు. కాగా ఆర్ ఆర్ ఆర్ (RRR Movie) స్ఫూర్తితో అల్లు అర్జున్ పెద్ద స్కెచ్ వేశాడట. దర్శకుడు సుకుమార్ కి సూచనలు ఇస్తున్నాడట. 

26
Rrr -Pushpa 2

ఆర్ ఆర్ ఆర్ మూవీలో నాటు నాటు సాంగ్ పిచ్చ పాప్యులర్ అయ్యింది. ఎన్టీఆర్, చరణ్(Ram Charan)ఒకరినొకరు పోటీపడుతూ ఆ సాంగ్ చేశారు. బీట్ కి ఇద్దరూ సింక్ మిస్ కాకుండా చేయడం ముచ్చటగొలిపింది. ఆద్యంతం ఎనర్జిటిక్ గా సాగిన నాటు నాటు సాంగ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

36
Rrr -Pushpa 2

కథ రీత్యా ఆర్ ఆర్ ఆర్ బిగింనింగ్ నుండి ఎండ్ వరకూ సీరియస్ గా సాగుతుంది. ఈ క్రమంలో హీరోల డాన్స్ స్కిల్స్ ఎస్టాబ్లిష్ చేసే సాంగ్ కి స్పేస్ లేదు. కానీ రాజమౌళి తెలివిగా బ్రిటీష్ పార్టీలో భీమ్, రామ్ డాన్స్ వేసేలా ఓ సెటప్ ఏర్పాటు చేశాడు. కథలో భాగంగా వచ్చిన ఆ సాంగ్ బాగా పేలింది. 

46
Rrr -Pushpa 2

మరోవైపు పుష్ప మూవీలో సుకుమార్ ఆ రిస్క్ తీసుకోలేదు. మొరటుగా ఉండే పుష్ప పాత్రకు ఇలాంటి స్టైలిష్ స్టెప్స్ తో కూడిన సాంగ్ సెట్ చేయలేదు. శ్రీవల్లి సాంగ్... లో కొంత మేర అల్లు అర్జున్ (Allu Arjun) స్టెప్స్ అలరించినప్పటికీ... పూర్తిగా ఆయన టాలెంట్ చూపించే ఛాన్స్ దక్కలేదు. ఈ క్రమంలో పుష్పలో నాటు నాటు సాంగ్ తరహాలో ఎనర్జిటిక్ స్టెప్స్ తో సాగే ఓ సాంగ్ ఉండేలా బన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

56
Rrr -Pushpa 2

ఈ మేరకు సుకుమార్ కి సూచనలు కూడా చేశారట. కాబట్టి పుష్ప 2 (Pushpa 2) లో అల్లు అర్జున్ డాన్స్ విశ్వరూపం కూడా చూపించనున్నాడన్న మాట. టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్స్ లో అల్లు అర్జున్ ఒకరు. డాన్సింగ్ స్కిల్స్ చూసి నార్త్ ఆడియన్స్ మెస్మరైజ్ కావడం ఖాయం. 

66
Rrr -Pushpa 2

ఇక పుష్ప 2 సెట్స్ పైకి వెళ్ళడానికి సిద్ధం అవుతుంది. పార్ట్ వన్ భారీ విజయం సాధించిన నేపథ్యంలో భారీ బడ్జెట్ తో పుష్ప 2 సిద్ధం చేస్తున్నారు. రష్మిక మందానా హీరోయిన్ గా నటిస్తుండగా, దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.

click me!

Recommended Stories