త్రిష రాయల్ లుక్.. పట్టు వస్త్రాలు, ఆభరణాల్లో మెరిసిపోతున్న సౌత్ క్వీన్.. వైరల్ పిక్స్

First Published | Aug 19, 2023, 3:32 PM IST

సీనియర్ హీరోయిన్ త్రిష కృష్ణన్ (Trisha Krishnan)  రాయల్ లుక్ లో మెరిసిపోతోంది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. సంప్రదాయ దుస్తుల్లో సౌత్ క్వీన్ ఆకట్టుకుంటోంది. 
 

అందంలో నాడు నేడు త్రిష ఏమాత్రం చెక్కుచెదరలేదు.  టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రారంభంలో ఎలా ఉందో ఇప్పుడూ అదే బ్యూటీఫుల్ లుక్ తో మెస్మరైజ్ చేస్తోంది. సెకండ్ ఇన్సింగ్స్ లోనూ ఈ ముద్దుగుమ్మ జోరుగా సినిమాలు చేస్తూ ఆడియెన్స్ ను అలరిస్తోంది. 
 

రీసెంట్ గా తమిళ బాహుబలిగా విడుదలైన ‘పొన్నియిన్ సెల్వన్’తో త్రిష మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. కుందవై పాత్రలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో త్రిష క్రేజ్ మరింతగా రైజ్ అయ్యింది. దాని తగ్గట్టుగానే వరుసగా సినిమాలు చేస్తోంది. 
 


ప్రస్తుతం తమిళం మలయాళంలో వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలోనూ మెరుస్తూ తన అభిమానులను ఖుషి చేస్తోంది. ఇటు సినిమాలతో పాటు అటు యాడ్ షూట్లు కూడా చేస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా ఓ బ్రాండ్ కోసం చేసిన ఫొటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది.

జీఆర్టీ జ్యూయెల్లరీకి సంబంధించిన యాడ్ షూట్ లో త్రిష నటించింది. పట్టు వస్త్రాలు, ఖరీదైన ఆభరణాలు ధరించి రాయల్ లుక్ ను సొంతం చేసుకుంది. నిండు దుస్తుల్లో సౌత్ క్వీన్ వెలిగిపోతోంది. కొన్ని ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
 

వయస్సు పెరుగుతున్నా ఏమాత్రం తగ్గని అందంతో త్రిష ఆకట్టుకుంటోంది. దీంతో ఆమె అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తూ త్రిషను ఆకాశానికి ఎత్తుతున్నారు. సౌత్ క్వీన్ కు తిరుగుతు లేదంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. లైక్స్ చేస్తూ వైరల్ గా మారుస్తున్నారు. 

‘పొన్నియిన్ సెల్వన్’ తర్వాత త్రిష నుంచి రాబోతున్న భారీ చిత్రం ‘లియో’. దళపతి విజయ్ సరసన చాలా ఏళ్ల తర్వాత నటిస్తోంది. అలాగే తమిళంలోనే ‘ది రోడ్’, ‘సతురంగ వెట్టై 2’ వంటి సినిమాలు చేస్తోంది. మరోవైపు మలయాళంలో ‘రామ్ : పార్ట్ 1’, ‘ఐడెంటిటీ’ సినిమాల్లో నటిస్తోంది. 

Latest Videos

click me!