Allu Arjun : తమ్ముడి పెళ్లికి ముందు అల్లు అర్జున్ గ్రాండ్ పార్టీ.. బన్ని ఇంటికి క్యూ కట్టిన సెలబ్రిటీలు..

Published : Feb 23, 2026, 06:15 AM IST

అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్, నయనికా రెడ్డిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇరు కుటుంబాలు పెళ్లి పనులతో బిజీగా ఉన్నాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్ తన తమ్ముడి పెళ్లికి ముందు ఓ గ్రాండ్ కాక్‌టెయిల్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి ఎవరెవరు వచ్చారంటే?

PREV
15
అల్లు అర్జున్ కాక్‌టెయిల్ పార్టీ

అల్లు అర్జున్ తన తమ్ముడు అల్లు శిరీష్ పెళ్లికి ముందు గ్రాండ్ కాక్‌టెయిల్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీ డ్రెస్ కోడ్ బ్లాక్. పార్టీలో రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో స్టైలిష్‌గా కనిపించాడు. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి చాలా గ్లామరస్‌గా మెరిశారు.

25
అల్లు అర్జున్ స్టైలిష్ లుక్

ఈ కాక్‌టెయిల్ పార్టీలో సూపర్ స్టార్ అల్లు అర్జున్ చాలా స్టైలిష్‌గా కనిపించాడు. అతను మెరిసే షర్ట్‌పై బ్లాక్ కోట్ ధరించాడు. గోల్డెన్ హెయిర్, గాగుల్స్‌తో అల్లు అర్జున్ పార్టీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు.

35
అల్లు శిరీష్-నయనికా రెడ్డిల సందడి

ఈ కాక్‌టెయిల్ పార్టీలో అల్లు శిరీష్, నయనికా రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరిద్దరూ మార్చి 6న పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ జంటకు అక్టోబర్ 2025లో నిశ్చితార్థం జరిగింది.

45
కాక్‌టెయిల్ పార్టీలో శ్రీలీల

అల్లు అర్జున్ తమ్ముడి కాక్‌టెయిల్ పార్టీలో హీరోయిన్ శ్రీలీల కూడా కనిపించారు. ఈ సందర్భంగా ఆమె పార్టీకి వచ్చిన అతిథులతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. అల్లు శిరీష్ కాక్‌టెయిల్ పార్టీకి టాలీవుడ్ స్టార్స్‌తో పాటు కొందరు సన్నిహితులు కూడా హాజరయ్యారు. పార్టీలో అందరూ ఫుల్ జోష్‌లో కనిపించారు.

55
అల్లు పార్టీలో రాశీ ఖన్నా, నిధి అగర్వాల్

అల్లు శిరీష్ కాక్‌టెయిల్ పార్టీలో హీరోయిన్లు రాశీ ఖన్నా, నిధి అగర్వాల్ కూడా సందడి చేశారు. ఈ ఇద్దరు హీరోయిన్లు తమ స్టైల్, లుక్స్‌తో పార్టీకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ నటుడు, నిర్మాత. అతను చాలా సినిమాల్లో నటించి మెప్పించాడు. వారి తండ్రి అల్లు అరవింద్ కూడా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత అన్న సంగతి తెలిసిందే.

Read more Photos on
click me!

Recommended Stories