పెళ్లి పీటలెక్కబోతున్న అల్లు అర్జున్ హీరోయిన్, కేథరిన్ ను పెళ్లాడబోయేది ఎవరంటే..?

Published : Jul 18, 2023, 08:01 PM IST

ఈ మధ్య ఫిల్మ్ ఇండస్ట్రీలో పెళ్లిళ్ళు ఎక్కువైపోయాయి.. పెళ్లి రూమర్లు కూడా భారీగా పెరిగాయి. తాజాగా మరో హీరోయిన్ కు పెళ్లంటూ న్యూస్ హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఏ హీరోయిన్ పెళ్లి.. ఇంతకీ వరుడు ఎవరు...? 

PREV
17
పెళ్లి పీటలెక్కబోతున్న అల్లు అర్జున్ హీరోయిన్, కేథరిన్ ను పెళ్లాడబోయేది ఎవరంటే..?

ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రెటీలు వరుసగా పెళ్లిళ్ల చేసుకుంటున్నారు. కొంతమంది ఇండస్ట్రీలో వారిని పెళ్ళడాబోతుంటే.. మరికొందరు మాత్రం ఇతర దేశాలవారినే ప్రేమించి పెళ్ళాడుతున్నారు.  అసలు ఒకప్పుడు సినిమాతారలు  పెళ్లిలు చేసుకోవడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు.. అలాంటిది ఇప్పుడు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుందామా అని ఎదురు చూస్తున్నారు. 

27

ఇక ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఎలా చేసుకంటున్నారో అంతే స్పీడ్ గా కొంత మంది జంటలు విడాకులు కూడా తీసుకుంటున్నారు. మరికొంత మంది మాత్రం.. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా ఉంటున్నారు. ఇక  త్వరలో మరో టాలీవుడ్  హీరోయిన్ పెళ్లి పీఠలు ఎక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఆ హీరోయిన్ మరోవరో కాదు.. కేథరిన్ థెరీస్సా.

37

అల్లు అర్జున్ తో కలిసి ఇద్దరమ్మాయిలతో.. సరైనోడు లాంటి సినిమాల్లోనటించి మెప్పించిన ఈబ్యూటీ త్వరలో పెళ్లి చేసుకోబోతుందట. తమిళ సినిమాలద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయిన కేథరిన్.. ఆతరువాత  చమ్మక్ చల్లో మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.  తొలి సినిమాతో కొంతవరకు సక్సెస్ అందుకుంది. 

47

ఇక వెంటనే తెలుగులో పైసా, రుద్రమదేవి, సరైనోడు, ఇద్దరమ్మాయిలతో, గౌతమ్ నంద, నేనే రాజు నేనే మంత్రి, వరల్డ్ ఫేమస్ లవర్, మాచర్ల నియోజకవర్గం వంటి సినిమాల్లో వరుసగా నటించి టాలీవుడ్ లో మంచి గుర్తింపు సాధించింది. కాని స్టార్ హీరోయిన్ హోదా మాత్రం సాధించలేకపోయింది. 

57

మరీ ముఖ్యంగా కేథరిన్  నటించిన సరైనోడు సినిమాలో  ఎమ్మెల్యే పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది బ్యూటీ. ప్రస్తుతం అంతగా అవకాశాలు లేకపోయే సరికి ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ.. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు నిత్యం ఫొటోలను షేర్ చేస్తూ ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది.

67
Catherine Tresa

కేథరిన్ గతంలోనే ఓ స్టార్ హీరోతో  లవ్ లో పడిపోయిందన్న రూమర్స్ గట్టిగా వినిపించాయి. ఆతరువాత అతనితో బ్రేకప్ చెప్పిందట. ఇక ఇప్పుడు పెళ్లి చేసుకోబోతుందట కేథరిన్. అయితే ఆమె పెళ్లి చేసుకోబోయేది మాత్రం.. ఇండస్ట్రీ వ్యక్తిని కాదట. తన చిన్నాటి స్నేహితుడిని పెళ్ళాడబోతుందట కేథరిన్. 

77
Catherine Tresa

ఇంట్లో వాళ్లకి చెప్పడంతో వాళ్లు వెంటనే ఓకే అన్నట్టు సమాచారం. సోషల్ మీడియాలో ఈ విషయం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.  అయితే  ఈ పెళ్లి వార్తల్లో నిజం ఎంతో తెలియదు కాని నెట్టింట్లో మాత్రం వైరల్ అవుతోంది. ఈ విషయంలో ఈ హీరోయిన్ స్పందిస్తే  కాని నిజం తెలియదు... అఫిషియల్ గా ప్రకటిస్తే కాని  క్లారీటీ రాదు. 

Read more Photos on
click me!

Recommended Stories