ఇక ఈషా రెబ్బా.. `అంతకు ముందు ఆ తర్వాత` సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా విజయం సాధించడంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది ఈషా. దీంతో బిజీ హీరోయిన్ అయిపోయింది. అయితే వరుసగా చిన్న బడ్జెట్ చిత్రాలే వచ్చాయి. `బందిపోటు`, `అమితుమీ` చిత్రాలతో విజయాలు అందుకుంది. చిన్న బడ్జెట్ చిత్రాలకు బెస్ట్ ఆప్షన్‌గా నిలిచింది. కానీ చిన్న సినిమాలకే పరిమితమయ్యిందీ బ్యూటీ. `దర్శకుడు`, `అ`, `బ్రాండ్ బాబు`, `అరవింద సమేత వీరరాఘవ`, `సుబ్రమణ్యపురం`, `రాగల24 గంటల్లో` చిత్రాలు చేసింది. ఆ తర్వాత సినిమాలు పెద్దగా హిట్ కాకపోవడంతో ఈ అమ్మడిని పట్టించుకోవడం మానేశారు. తమిళంలో, మలయాళంలో ఆఫర్లు దక్కించుకుంది. అక్కడ ఆకట్టుకుంది. కానీ నో ఆఫర్స్.