అల్లు అర్జున్ కోసం ఎన్టీఆర్ ట్రైనర్ ను సెట్ చేసిన అట్లీ, హాలీవుడ్ హీరోగా మారబోతున్న ఐకాన్ స్టార్

Published : May 04, 2025, 01:27 PM IST

అట్లీతో అంతర్జాతీయ సినిమా కోసం రెడీ అవుతున్నాడు అల్లు అర్జున్. ఈసినిమాకు సబంధించి తనను తాను మార్చకునే ప్రయత్నం మొదలు పెట్టాడు. భారీ యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందబోతున్న ఈసినిమా కోసం, హాలీవుడ్ హీరో గా మారబోతున్నాడు. అందుకోసం ప్రత్యేకంగా  ట్రైనర్ ను కూడా పెట్టుకున్నాడు.   

PREV
15
అల్లు అర్జున్ కోసం ఎన్టీఆర్ ట్రైనర్ ను సెట్ చేసిన అట్లీ, హాలీవుడ్ హీరోగా మారబోతున్న ఐకాన్ స్టార్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీతో చేయబోతున్న సినిమాను పాన్ వరల్డ్ సినిమాగా తెరకక్కించబోతున్నారు. దాదాపు 800 కోట్ల బడ్జెట్ తో ఈమూవీ రూపొందబోతుంది.  రీసెంట్ గా  ఈ ప్రాజెక్టుపై నిర్మాణ‌ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ అధికారిక ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేసింది. ఇది డిఫ‌రెంట్ జోన‌ర్‌లో తెర‌కెక్క‌నున్న ప్రాజెక్ట్‌. దాంతో ఈ మూవీ కోసం బ‌న్నీ ప్ర‌త్యేకంగా మారబోతున్నాడు.

Also Read: అభిషేక్ కంటే ముందు ఐశ్వర్య రాయ్ 7 ప్రేమకథలు, స్టార్ హీరోయిన్ ప్రేమించిన హీరోలు ఎవరో తెలుసా?

25
Allu Arjun Next Movie with Atlee: A Hollywood-Style Sci-Fi Blockbuster

యాక్షన్ అడ్వెంచర్ మూవీ కావడంత పాటు.. ఇందులో  అల్లు అర్జున్ మూడు పాత్రల్లో కనిపించబోతుండటంతో అందుకు తగ్గట్టుగా తన బాడీని మార్చుకోబోతుననాడు అల్లు అర్జున్. ఇది చిన్న విషయం కాదు. బాడీని ఫిట్ గా ఉంచుకోవడం వేరు.. సినిమాకు తగ్గట్టుగా మార్చుకోవడం వేరు. అందుకు చాలా కష్టపడాలి. కొన్ని సందర్భాల్లో రిస్క్ కూడా చేయాలి.సినిమాకోసం ఎంత కష్టపడటానికైనా రెడీగా ఉండే అల్లు అర్జున్. ఈసినిమా కోసం తన  శ‌రీర ఆకృతిని మార్చుకునే ప‌నిలో ప‌డ్డారు.

Also Read: 42 ఏళ్ల త్రిష ఆస్తి ఎన్ని కోట్లు? స్టార్ హీరోయన్ లగ్జరీ లైఫ్, నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా?

35

తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ఈ సినిమా కోసం బ‌న్నీకి శిక్షణ ఇవ్వనున్నార‌ని తెలుస్తుంది. ఇక‌, స్టీవెన్స్‌కు టాలీవుడ్‌తో మంచి అనుబంధం ఉంది. గతంలో ఆయన  యంగ్ టైగర్ ఎన్టీఆర్,  మహేశ్‌ బాబు వంటి స్టార్ హీరోలకు ఫిట్‌నెస్ ట్రైనింగ్ ఇచ్చారు. సినిమాలకు తగ్గట్టుగా వారిని మార్చి చూపించాడు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ వంతు వచ్చింది.  

Also Read: 50 ఏళ్ల వయసులో రెండో పెళ్లికి రెడీ అయిన సుమంత్, హీరోయిన్ తో అక్కినేని హీరో ప్రేమ, నిజమెంత?

45
Allu Arjun - Jr NTR

అయితే అల్లు అర్జున్ తో స్లీవెన్స్ పనిచేయడం పక్కా అని తెలుస్తుంది. మూవీ టీమ్ అఫీషియట్ గా చెప్పకపోయినా.. తాజాగా తాను ఐకాన్ స్టార్‌తో క‌లిసి ప‌ని చేయ‌బోతున్న‌ట్లు స్టీవెన్స్ వెల్ల‌డించారు. ఈ విషయాన్ని ఆయ‌న  ఎక్స్ (ట్విట్ట‌ర్‌) ద్వారా వెల్ల‌డించారు. అల్లు అర్జున్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సంద‌ర్భంగా బ‌న్నీతో క‌లిసి దిగిన ఓ ఫొటోను శేర్ చేశాడు. ఇప్పుడు స్టీవెన్స్ ట్వీట్ సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

Also Read: సినిమాకు 20 కోట్లు డిమాండ్ చేస్తున్న సౌత్ హీరోయిన్, నిర్మాతలకు షాక్ ఇస్తున్న నటి ఎవరు?

55
Allu Arjun Next Movie with Atlee: A Hollywood-Style Sci-Fi Blockbuster

ఇక ఈ సినిమా గురించి రోజుకో న్యూస్ బయటకు వస్తుంది. బన్నీ మూడు పాత్రల్లో నటించడంతో పాటు.. ముగ్గురు హీరోయిన్లు కూడా నటిస్తున్నట్టు సమాచారం. జాన్వీ కపూర్, సమంతతో పాటు మరో హీరోయిన్ ను తీసుకునే ప్రయత్నంలో ఉన్నారట టీమ్. అంతే కాదు ఆస్కార్ లక్ష్యంగా ఈమూవీని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. అంతే కాదు ఈమూవీలో హాలీవుడ్ నట దిగ్గజం విల్ స్మిత్ కూడా నటించబోతున్నట్టు తెలుస్తోంది. 

Read more Photos on
click me!

Recommended Stories