అల్లు అర్జున్ తన కెరీర్ లో రాఘవేంద్ర రావు, వివి వినాయక్, సుకుమార్, త్రివిక్రమ్ లాంటి అగ్ర దర్శకులతో సినిమాలు చేశారు. కానీ టాలీవుడ్ లో ఒకే ఒక్క దర్శకుడంటే అల్లు అర్జున్ కి భయం అట.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని హీరో. పుష్ప 2 చిత్రం ఇండియా బాక్సాఫీస్ వద్ద చాలా రికార్డులు సృష్టించింది. తన తదుపరి చిత్రంతో అల్లు అర్జున్ పాన్ వరల్డ్ బాక్సాఫీస్ ని టార్గెట్ చేశారు. బన్నీ నెక్స్ట్ మూవీ అట్లీ దర్శకత్వంలో ఉండబోతున్న సంగతి తెలిసిందే.
25
అల్లు అర్జున్ తన కెరీర్ లో రాఘవేంద్ర రావు, వివి వినాయక్, సుకుమార్, త్రివిక్రమ్ లాంటి అగ్ర దర్శకులతో సినిమాలు చేశారు. కానీ టాలీవుడ్ లో ఒకే ఒక్క దర్శకుడంటే అల్లు అర్జున్ కి భయం అట. కానీ ఆ దర్శకుడితో అల్లు అర్జున్ ఒక్క మూవీలో కూడా నటించలేదు.
35
Allu Arjun
ఆ దర్శకుడు ఎవరంటే.. వినోదాత్మక చిత్రాలకు బ్రాండ్ అయిన ఎస్వీ కృష్ణారెడ్డి. ఆయన దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించలేదు. మరి ఎస్వీ కృష్ణారెడ్డి అంటే అల్లు అర్జున్ కి ఎందుకు అంత భయం అనే సందేహం రావచ్చు. దానికి సమాధానం స్వయంగా ఎస్వీ కృష్ణారెడ్డి ఓ ఇంటర్వ్యూలో ఇచ్చారు.
45
ఎస్వీ కృష్ణారెడ్డి గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కించిన చిత్రం పెళ్ళాం ఊరెళితే. గీతా ఆర్ట్స్ తమ నిర్మాణ సంస్థే కాబట్టి అల్లు అర్జున్ ఆ చిత్ర షూటింగ్ చూడడానికి వెళ్లేవారట. అంతే కాదు షూటింగ్ ఎలా జరుగుతుందో తెలుసుకునేందుకు ఎస్వీ కృష్ణారెడ్డికి బన్నీ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆ టైంలో ఎస్వీ కృష్ణరెడ్డి చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరించేవారు. వామ్మో దర్శకులు సెట్స్ లో ఇంత కఠినంగా ఉంటారా అనే అభిప్రాయం అప్పుడే అల్లు అర్జున్ కి ఏర్పడింది.
55
SV Krishna Reddy
పెళ్ళాం ఊరెళితే చిత్రం రిలీజ్ అయ్యాక అల్లు అర్జున్ గంగోత్రి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఎంత మంది దర్శకులతో పనిచేసినా కృష్ణారెడ్డి అంటే భయం అలాగే ఉండిపోయింది. సార్ మీరంటే నాకు తెలియని భయం ఎప్పుడూ ఉంటుంది అని బన్నీ తనతో చెప్పినట్లు ఎస్వీ కృష్ణారెడ్డి ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.