మెగా, అల్లు ప్యామిలీ మధ్య విభేదాల వార్తలు నేపధ్యంలో మరోసారి అల్లు అర్జున్, రామ్ చరణ్ ఒకే ఫ్రేమ్ లో సందడి చేశారు. ఇద్దరు స్టార్స్ ఇలా కనిపించే వరకూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
చాలా కాలంగా మెగా, అల్లు కుటుంబాల మధ్య తెలియని గ్యాప్ నడుస్తోంది. అఫీషియల్ గా వీరు గొడవపెట్టుకున్నది లేదు, బయటకి వచ్చి కామెంట్స్ చేసుకున్నది లేదు. కానీ ఎందుకో ఈ ఫ్యామిలీస్ మధ్య కాస్త దూరం కొనసాగుతూ వచ్చింది. ఇక ఎలెక్షన్స్ టైమ్ లో అల్లు అర్జున్ తన స్నేహితుడైన వైసీపీ లీడర్ రవికి సపోర్ట్ చేస్తూ ప్రచారం చేయడం, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకపోవడంతో.. ఈ వార్తలు మరింతగా పెరిగిపోయాయి. కిందస్థాయిలో వ్యక్తులు రకరకాలుగా మాట్లాడుకోవడం, విమర్శలు చేసుకోవడం జరిగింది. ఈక్రమంలోనే మెగా,అల్లు ఫ్యామిలీలను ఒకటి చేసే సందర్భాలు కూడా కొన్ని వచ్చాయి.
25
అల్లు అర్జున్ కు అండగా మెగా కుటుంబం
ఈ క్రమంలో అల్లు అర్జున్ పుష్ప రిలీజ్ అవ్వడం.. తొక్కిసలాటలో ఒకరు ప్రాణాలు కోల్పోవడంతో..బన్నీ అరెస్ట్ అయ్యి.. ఒక రోజు జైల్లో ఉన్నారు. అప్పుడు మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ కు అండగా నిలబడింది. చిరంజీవి స్వయంగా ఇంటికి వెళ్లి పరామర్శించడంతో పాటు.. రంగంలోకి దిగి.. బన్నీని బయటకు రప్పించారన్న టాక్ ఉంది. ఆతరువాత అల్లు అర్జున్ చిరంజీవి, నాగబాబు ఇంటికి వెళ్లి కృతజ్ఞతలు కూడా తెలుపుకున్నారు. దాంతో రెండు కుటుంబాల మధ్య కాస్త పాజిటీవ్ వాతావరణం వచ్చింది. ఇక రీసెంట్ గా అల్లు అర్జున్ నానమ్మ, రామ్ చరణ్ అమ్మమ్మ అల్లు నాగరత్నమ్మ చనిపోయినప్పుడు మెగా ఫ్యామిలీ అంతా అల్లు ఇంట్లోనే ఉండి.. అంతా చూసుకున్నారు. అప్పుడు కూడా అందరు క్లోజ్ గా మాట్లాడుకోవడం ఫ్యాన్స్ ను సంతోషపెట్టింది. ఇక తాజాగా మరోసారి అల్లు, మెగా కుటుంబాలు ఒకే ఫ్రేమ్ లో సందడి చేయడంతో, అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
35
ఒకే ఫ్రేమ్ లో రామ్ చరణ్ - అల్లు అర్జున్
మొదటి నుంచి అల్లు అర్జున్, రామ్ చరణ్ కలిసి కనిపిస్తే చూడాలని ఫ్యాన్స్ ఎదురు చూశారు. వారు అనుకున్నట్టుగానే ఈమధ్య కాలంలో ఇద్దరు క్లోజ్ గా మూవ్ అవుతూ కనిపిస్తున్నారు. రీసెంట్ గా అల్లు కుటుంబంలో వేడుక జరిగింది. హీరో అల్లు శిరీష్ నిశ్చితార్థం శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, అలాగే కొంతమంది సినీ ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. ఈ వేడుకల్లో మెగా, అల్లు ఫ్యామిలీ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తాజాగా అల్లు శిరీష్ తన నిశ్చితార్థ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాజాగా ఆ వేడుకలో తీసిన పలు ఫ్యామిలీ ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ ఫొటోల్లో మెగా – అల్లు కుటుంబ సభ్యులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు. మరీ ముఖ్యంగా రామ్ చరణ్, అల్లు అర్జున్ కలిసి కనిపించడం అభిమానులకు కనులవిందుగా మారింది. ఇక నుంచి ఈ రెండు ఫ్యామిలీల మధ్య గ్యాప్ వార్తలు రాకుండా ఉంటే బాగుండు అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నిశ్చితార్థ వేడుక ఫొటోల్లో కాబోయే జంట అల్లు శిరీష్ , నయనికతో పాటు శ్రీజ, లావణ్య, అల్లు బాబీ, ఆయన భార్య, రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, అల్లు స్నేహ, సురేఖ, అల్లు అరవింద్, పవన్ భార్య అన్న లెజనోవా, అలాగే అల్లు అరవింద్ భార్య కనిపించారు.
55
పండగ చేసుకుంటున్న అభిమానులు
వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు కూడా హాజరయ్యారు. అతిథులతో కూర్చున్న చిరంజీవి, నాగబాబు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో ఈ ఫోటోలకు ఫ్యాన్న్ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. పిక్స్ ను వైరల్ చేస్తున్నారు. భారీగా షేర్ చేస్తున్నారు.