టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ ఎప్పుడూ ప్రత్యేకమే. అందుకే వీలైనంత ఎక్కువ చిత్రాలు సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావిస్తారు. ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తలపడ్డాయి. రెండు చిత్రాలు మంచి విజయం సాధించాయి. వాల్తేరు వీరయ్య అయితే 100 కోట్ల పైగా షేర్ సాధించి దూసుకుపోతోంది.