హీరోయిన్ గా రవీనా టండన్ కూతురు.. స్టార్ హీరో మేనల్లుడికి జంటగా సినిమా...?

Published : Jan 21, 2023, 04:23 PM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో వారసత్వం కామన్. రాజకీయంలో కంటే కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలోనే వారసులు ఎక్కువగా ఉన్నారు. సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా వారసులు.. వారసురాళ్లు.. ఎక్కువగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈక్రమంలో మరో వారసురాలు ఎంట్రీకి రంగం సిద్దం అయ్యింది.   

PREV
18
హీరోయిన్ గా రవీనా టండన్ కూతురు.. స్టార్ హీరో మేనల్లుడికి జంటగా సినిమా...?

ఫిల్మ్  ఇండస్ట్రీలోకి వరుసగా వారసుల ఎంట్రీలు జరుగుతూనే ఉన్నాయి. ఇటు సౌత్ లో.. అటు నార్త్ లో చాలా మంది తారు వచ్చారు. అందులో కొంత మంది సక్సెస్ అయితే.. మరికొంత మంది నిలవలేక వెనుదిరిగారు. బాలీవుడ్ లో ఆలియా భట్, అనన్య పాండే, జాన్వీ కపూర్ లాంటి హీరోయిన్లు వారసత్వంతో వచ్చినవారే. ఈక్రమంలోనే సీనియర్ హీరోయిన్ రవీనా టండన్ వారసురాలు బాలీవుడ్ ఎంట్రీ కి రెడీ అవుతోంది. 

28

మరో నట వారసురాలు సినీ  రంగ ప్రవేశానికి రంగం సిద్థం అవుతుంది. ఒకప్పుడు తన అందాలతో  యుత్ ను ఆకట్టుకున్న స్టార్ సీనియర్ హీరోయిన్. రవీనా టాండన్ కూతురు త్వరలో హీరోయిన్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుందని ఇండస్ట్రీ వర్గాల నుంచి ఇన్ ఫార్మేషన్. ఈ టాక్ బయటకు రావడంతో..  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

38

రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.  హాట్ హాట్ ఫోటోషూట్స్ తో ఇప్పటికే సందడి చేస్తోంది. ఫాలోయింగ్ తో పాటు.. రవీనా కూతురిగా ఇమేజ్ కూడా ఉండటంతో  బాలీవుడ్ ఎంట్రీకి ఆమెకు రూట్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. దాంతో త్వరలోనే ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైనట్టు సమాచారం 
 

48

ఇక్కడ మరో విశేషం ఏంటంటే..రాషా తడానీ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుండగా.. ఈసినిమాతో  అజయ్ దేవగణ్ మేనల్లుడు అమన్ దేవగణ్ హీరోగా నటించబోతున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరు  జంటగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టబొతున్నారు. ఈ యంగ్ కపుల్ ఎంట్రీ మూవీని  అభిషేక్ కపూర్ నిర్మిస్తున్నారు. మార్చి నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని ఈ సమాచారం. 

58

ఈ సినిమా కథ రాషఆ  వినడం.. అంతా ఓకే అయిపోయి సైన్ చేయడం కూడా అయిపోయిందని సమాచారం. అంతే కాదు ఈసినిమాలో అజయ్ దేవగణ్ కూడా నటిస్తున్నాడట. అజయ్ దేవ్ గణ్ మునుపెన్నడు కనిపించనంత వెరైటీ పాత్రలో కనిపించనున్నాడట అజయ్. 
 

68

ఈ వార్త వినిపించడంతో.. అందరి దృష్టీ రవీనా వారసురాలిపై పండింది. ఈవార్త తెలిసి ఆమె గురించి గూగుల్ లో వెతుకుతున్నారు బాలీవుడ్ జనాలు. ఆమె అందాలకు ఫిదా అవుతున్నారు.  మరి రాషా సినిమాల్లో ఎలా రాణిస్తుందో చూడాలి.

78

రవీనా టాండన్.. టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. పలు తెలుగు చిత్రాలో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో రవీనా టాండన్ ఒకరు. 1990ల్లో తన అంద చందాలతో యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. 

88

బాలీవుడ్ తో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలోని అభిమానుల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో పలు సినిమాలతో బిజీ బిజీగా ఉంది. సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన కేజీఎఫ్ చిత్రంలో అద్భుతమైన నటనతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. 

click me!

Recommended Stories