AA23: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా వెలుగు వెలుగుతున్నాడు. బన్నీతో సినిమా అంటే బాలీవుడ్ హీరోయిన్లు కూడా క్యూలో నిలబడతారు. కానీ ఏరి కోరి అల్లు అర్జున్
'పుష్ప' చిత్రంతో పాన్-ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, వరుసగా ప్రయోగాత్మక పాన్-వరల్డ్ కథలతో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న 'రాకా' మూవీ షూటింగ్‌లో బన్నీ బిజీ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తన 23వ చిత్రాన్ని (AA23) పట్టాలెక్కించడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
25
హీరోయిన్ గా పూజా హెగ్డే ఫిక్స్ అయ్యిందా..?
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్న తరుణంలో.. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేను పరిశీలిస్తున్నట్లు వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన రీసెంట్ మూవీ 'కూలీ'లో పూజా హెగ్డే ప్రత్యేక గీతం 'మోనికా'తో ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకుంది. ఆ అనుబంధంతోనే ఈ కొత్త ప్రాజెక్ట్‌లోనూ ఆమెకు కీలక పాత్ర కేటాయిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
35
భయపడుతున్న అభిమానులు..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. అభిమానులు మాత్రం పూజా హెగ్డే విషయంలో భయంతో ఉన్నారు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయినా.. ఇప్పుడు పూజా హెగ్డే ఉన్నపరిస్థితుల్లో ఈసినిమాకు మైనస్ అవుతుందేమో అని బయపడుతున్నారు. వరుసగా ప్లాప్ లు పడేసరికి పూజా ప్లాప్ హీరోయిన్ అన్న పేరు వచ్చింది. కొంత మంది ఐరన్ లెగ్ అని కూడా అంటున్నారు.
అల్లు అర్జున్, పూజా హెగ్డే కాంబినేషన్ నిజంగా సెట్ అయితే.. ఇది వారికి ముచ్చటగా మూడో సినిమా అవుతుంది. గతంలో ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన 'దువ్వాడ జగన్నాథం (DJ), అల వైకుంఠపురములో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు వారి కెమిస్ట్రీకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అల వైకుంఠపురములో సినిమాతో ఈ జంట ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో పాటు అందులోని 'బుట్టబొమ్మ' పాట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
55
హీరోయిన్లు చాలా స్పెషల్..
సాధారణంగా లోకేశ్ కనగరాజ్ తన యాక్షన్ డ్రామాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రత్యేకమైన శైలి, ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. ఒకవైపు బన్నీ మాస్ ఇమేజ్, మరోవైపు లోకేశ్ డార్క్ యాక్షన్ వాతావరణంలో పూజా హెగ్డే ఎలా ఒదిగిపోతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే, సోషల్ మీడియా వ్యాప్తంగా ఈ 'హ్యాట్రిక్ కాంబో'పై చర్చ నడుస్తున్నప్పటికీ, మేకర్స్ లేదా నిర్మాణ సంస్థ నుండి దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అధికారిక క్లారిటీ వస్తే ఏది నిజమో తెలుస్తుంది.