ప్రస్తుతం అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే అనిపించాయి. అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో డైరెక్టర్ చందూ ముండేటి ఆసక్తికర విషయం రివీల్ చేశారు.
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో 400 కోట్ల భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నారు. ఉత్తరాంధ్ర విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే చిత్రం ఇది. ఇందులో రసవత్తరమైన క్రీడా అంశాలు ఉంటాయట. రాంచరణ్ రగ్గడ్ లుక్ తో షాక్ ఇవ్వబోతున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం తర్వాత రాంచరణ్ సుకుమార్ దర్శకతంలో నటించాల్సి ఉంది.
25
Allu Aravind
ఒక సంచలన విషయం బయటకి వచ్చింది. ప్రస్తుతం అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే అనిపించాయి. అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో డైరెక్టర్ చందూ ముండేటి ఆసక్తికర విషయం రివీల్ చేశారు. అల్లు అరవింద్.. రాంచరణ్ తో 300 కోట్ల బడ్జెట్ లో భారీ చిత్రాన్ని ప్లాన్ చేశారని తెలిపారు. ఈ చిత్రానికి దర్శకుడిగా నన్నే ఎంచుకున్నారు అని చందూ ముండేటి తెలిపారు. కథ కూడా సిద్ధం గా లేదు.
35
కానీ అల్లు అరవింద్ గారు తనకి ఆఫర్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. చందూ ముండేటి తెరకెక్కించిన కార్తికేయ 2 అల్లు అరవింద్ కి విపరీతంగా నచ్చేసిందట. అందుకే ఈ అవకాశం ఇచ్చారు. కానీ ఆ చిత్రం కుదర్లేదు. చివరికి నాగ చైతన్యతో తండేల్ ఫిక్స్ అయింది అని చందూ తెలిపారు. 300 కోట్ల బడ్జెట్ లో రాంచరణ్ తో కానీ, సూర్యతో కానీ సినిమా చేయాలనేది అల్లు అరవింద్ ఆలోచన అని చందూ తెలిపారు.
45
సూర్యతో తాను సినిమా చేయబోతున్నట్లు చందూ ముండేటి కంఫర్మ్ చేశారు. రాంచరణ్ తో ఫ్యూచర్ లో తప్పకుండా చిత్రం చేస్తానని పేర్కొన్నారు. చందూ ముండేటి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
55
చందూ ముండేటి, నాగ చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కిన తండేల్ చిత్రం ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. నాగ చైతన్య, సాయి పల్లవి ఈ చిత్రంలో జంటగా నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.