Allu Aravind: పవన్‌ కళ్యాణ్‌ వెండితెరకు పరిచయమై 30ఏళ్లు.. అల్లు అరవింద్‌ ఎమోషనల్‌ నోట్‌

Published : Oct 12, 2026, 05:46 PM IST

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా వెండితెరకు పరిచయమై నేటితో ముప్పై ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్‌ ఎమోషనల్‌ నోట్‌ని పంచుకున్నారు. ఆ జర్నీని గుర్తు చేసుకున్నారు.

PREV
12
పవన్‌ కళ్యాణ్‌పై అల్లు అరవింద్‌ ఎమోషనల్‌ నోట్‌

సినీ రంగంలో పవన్ కళ్యాణ్ 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌తో కలిసి చేసిన తొలి సినిమా `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` నుంచి ఇప్పటి వరకు సాగిన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. మూడు దశాబ్దాల కాలం ఇంత త్వరగా గడిచిపోయిందా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

సినీ రంగంలో పవన్ కళ్యాణ్ సాధించిన విజయాలను అభినందిస్తూ, ఆయన ఎంచుకునే ప్రతి మార్గంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సినిమాలకే పరిమితం కాకుండా సమాజం పట్ల పవన్ కళ్యాణ్‌కు ఉన్న దూరదృష్టిని కూడా అల్లు అరవింద్ ప్రశంసించారు. సినిమా రంగం వెలుపల కూడా ఆయన చేస్తున్న సేవలను, సమాజం కోసం అందిస్తున్న తన వంతు కృషిని అభినందించారు. పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణం మరింత విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ, మరోసారి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఆయన చేపట్టే కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని కోరుకుంటూ తన ఆశీస్సులు అందించారు. సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్, ప్రస్తుతం సినీ రంగంతో పాటు ప్రజా జీవితంలోనూ తనదైన పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా విధులు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.

22
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయికి 30 ఏళ్లు

మెగాస్టార్‌ చిరంజీవి తమ్ముడిగా పవన్‌ కళ్యాణ్‌ని హీరోగా పరిచయం చేశాడు అల్లు అరవింద్‌. తన తొలి మూవీ `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` చిత్రాన్ని నిర్మించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మించారు. దీనికి ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించగా, ఇందులో అక్కినేని అమ్మాయి సుప్రియా యార్లగడ్డ హీరోయిన్‌గా నటించింది. ఆమె నటించిన ఏకైక మూవీ ఇదే కావడం విశేషం. సినిమా బాగానే ఆడింది. ముఖ్యంగా ఇందులో పవన్‌ స్వయంగా చేసిన మార్షల్ ఆర్ట్స్ ఆశ్చర్యపరిచాయి. కార్లని తన చేతులపై నడిపించుకొని షాకిచ్చాడు. ఇదే సినిమాలో హైలైట్‌గా చెప్పొచ్చు. ఈ సినిమా 1996 అక్టోబర్‌ 11న విడుదలైంది. నేటికి సరిగ్గా 30ఏళ్లు పూర్తయ్యింది. ఈ మూవీతోనే పవన్‌ వెండితెరకు హీరోగా పరిచయం అయ్యారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories