గత సీజన్ పూర్తిగా విమర్శల పాలైంది. కనీస ఆదరణ దక్కలేదు. కనీసం సీరియల్ కి వచ్చే రేటింగ్ కూడా రాలేదు. దారుణంగా 2 రేటింగ్ కి బిగ్ బాస్ పడిపోయింది. వీకెండ్స్ కి కూడా కూడా 4 రేటింగ్ దాటలేకపోయింది. చెప్పాలంటే సీజన్ 6 పెద్ద ఎత్తున విమర్శలపాలైంది. నాగార్జున హోస్టింగ్, ఎలిమినేషన్స్ పై వ్యతిరేకత వ్యక్తమైంది. అలాగే కసి లేని కంటెస్టెంట్స్, పసలేని గేమ్స్ కిక్ ఇవ్వలేకపోయాయి.