Brahmamudi: చెల్లెలి మీద అసూయతో రగిలిపోతున్న స్వప్న.. అప్పు విషయం తెలుసుకొని షాకైన కావ్య!

Published : Jul 11, 2023, 09:24 AM IST

Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. అత్తింట్లో చెల్లెలికి దక్కుతున్న గౌరవాన్ని చూసి అసూయ పడుతున్న ఒక అక్క కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూలై 11 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
18
Brahmamudi: చెల్లెలి మీద అసూయతో రగిలిపోతున్న స్వప్న..  అప్పు విషయం తెలుసుకొని షాకైన కావ్య!

 ఎపిసోడ్ ప్రారంభంలో కావ్య కి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం కోసం నానా తంటాలు పడతాడు రాజ్. ఆ విషయం అర్థం చేసుకుంటుంది ధాన్యలక్ష్మి.  వెళ్లి కావ్యని పిలుచుకు వస్తుంది. కావ్య తో పాటు స్వప్న కూడా వస్తుంది. అప్లికేషన్ ఒకటే ఉంది ఎవరి పేరు మీద రాయమంటారు అని అడుగుతాడు బ్యాంక్ అతను. బ్యాంకులో దాచుకునే అంత డబ్బు నా దగ్గర లేదు అక్క పేరు మీదే ఎకౌంటు ఓపెన్ చేయండి అంటుంది కావ్య.
 

28

 ధాన్యలక్ష్మి, రాజ్ మందలించి కావ్య పేరు మీద ఎకౌంటు ఓపెన్ చేయిస్తారు. అసూయతో రగిలిపోయిన స్వప్న తన గదిలోకి వెళ్లి భర్త చూస్తుండగా ఫ్లవర్ విసిరేస్తుంది. నీకేమైనా పిచ్చా ఎందుకు అలా చేస్తున్నావ్ అని అడుగుతాడు రాహుల్. అక్కడ నీ భార్యని అవమానిస్తుంటే నువ్వు మీ అమ్మ చూస్తూ ఊరుకున్నారు కానీ ఏమీ అనలేకపోయారు. రాజ్ కి కావ్య అంటే అసలు ఇష్టం ఉండేది కాదు కానీ ఇప్పుడు భార్యని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు.
 

38

నువ్వు మాత్రం నన్ను భార్యగా అసలు చూడటం లేదు. అందుకే ఇంట్లో వాళ్ళు కూడా విలువ ఇవ్వడం లేదు అంటూ చిందులు తొక్కుతుంది. కావ్య మీ చెల్లెలే కదా ముందు తనని కంట్రోల్ లో పెట్టుకో అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ నీ కంట్రోల్లో ఉంటారు అంతేగాని నా మీద అరిస్తే ఏమీ ఉపయోగం ఉండదు అంటూ రాహుల్ కూడా స్వప్న మీద కేకలు వేస్తాడు. మరోవైపు కనకం ఇంటికి నానమ్మని కాబోతున్నాను అంటూ స్వీట్స్ తీసుకుని వస్తుంది. మా వియ్యాలవారు సూడిదలు తీసుకొని వస్తారు అప్పుడు నువ్వు కూడా పేరంటానికి రా అని కనకాన్ని పిలుస్తుంది వచ్చినావిడ.
 

48

 అప్పుడు కనకానికి గుర్తొస్తుంది స్వప్నకి సూడిదలు ఇవ్వలేదని. వచ్చినవిడ వెళ్లిపోయిన తర్వాత కడుపుతో ఉన్న వాళ్ళకి ఏదైనా తినాలనిపిస్తుంది అని స్వప్నని తలుచుకుని బాధపడుతుంది కనకం. మరోవైపు ఆఫీస్ కి వెళ్ళటానికి బయటికి వచ్చిన రాజ్ కార్ డోర్ ఓపెన్ చేస్తాడు. అందులో కావ్య ఉండడం చూసి షాక్ అవుతాడు ఎక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. నేనేమీ సరదాకి కార్ ఎక్కలేదు ఇదిగోండి ఇన్హేల్లర్స్ పెడుతున్నాను ఒకటి కారులో ఉంచుకొని ఇంకొకటి ఆఫీస్ లో మీ డ్రాయర్ సొరుగు లో పెట్టుకోండి అని జాగ్రత్తలు చెప్తుంది.

58

మిమ్మల్ని డబ్బులు అడిగింది కూడా అందుకే అని ఎక్స్ప్లనేషన్ ఇస్తుంది. కావ్య చేసిన పనికి ఫిదా అయిపోతాడు రాజ్. అతను ఆఫీస్ కి వెళ్ళిపోయిన తర్వాత అదంతా చూస్తున్నా కళ్యాణ్ కావ్య దగ్గరికి వచ్చి మీరు కార్లో ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. కారు డ్రైవింగ్ రాకపోవడం ఎంత ప్రమాదమో నాకు మోన్నే తెలిసింది నేను కారు డ్రైవింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నాను అంటుంది కావ్య. నేనున్నాను కదా వదిన నేర్పిస్తాను లెండి అంటాడు కళ్యాణ్.
 

68

 మరోవైపు కిచెన్ లో తనకోసం ఏదో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది స్వప్న. అప్పుడే అక్కడికి వచ్చిన ధాన్యలక్ష్మి ఏదైనా కావాలంటే కావ్య అని అడగొచ్చు కదా కడుపుతో ఉన్నావు ఎందుకు అంత ఇబ్బంది పడతావు అంటుంది. నాకు నచ్చింది చేసుకొని తినే స్వేచ్ఛ కూడా నాకు లేదు అయినా అన్నింటికీ ఆ కావిని అడుక్కోవలసిన అవసరం నాకు ఏమీ లేదు అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

78

 దారిలో కనిపించిన అత్తగారితో చూశారా ఆవిడ ఏం మాట్లాడుతుందో మీరేమీ మాట్లాడరేమి అని  అత్తగారిని అడుగుతుంది స్వప్న. నీకు లేనిది మీ చెల్లెల దగ్గర ఒకటి ఉంది అదే  తెలివితేటలు. ఆ తెలివితేటలతో తను అందర్నీ తన బట్టలో వేసుకుంటుంది అంటుంది కావ్య. నాకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చే రోజు వస్తుంది అంటుంది స్వప్న. పగటి కలలు కనకు కావ్య ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు నీకు ఎవరు విలువ ఇవ్వరు అంటూ స్వప్నని రెచ్చగొట్టేలాగా మాట్లాడుతుంది రుద్రాణి.
 

88

 అదీ చూస్తాను అని పౌరుషంగా అంటుంది స్వప్న. మరోవైపు డ్రైవింగ్ నేర్చుకుంటున్న ప్రాసెస్ లో పోలీస్ ని గుద్దేస్తోంది కావ్య. ఇప్పుడు వాడు నన్ను గుద్దేస్తాడు అని కంగారు పడతాడు కళ్యాణ్. భయంతో ఇద్దరు అక్కడి నుంచి మాయమైపోతారు. మరోవైపు ఆఫీస్ కి వచ్చిన రాజ్ దగ్గరికి డిజైనర్ జువెలరీ డిజైన్ తీసుకొని వస్తుంది. మరోవైపు తండ్రి తో మాట్లాడుతున్న కావ్యకి అప్పుడే సేటు రావడం తండ్రి మీద కేకలు వేయటం చేసినప్పుడు తీర్చమంటూ అసహ్యంగా మాట్లాడటం అని విని షాక్ అవుతుంది కావ్య.

click me!

Recommended Stories